సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా విరూపాక్ష. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో, ప్రేక్షకులు థియేటర్ కి క్యూలు కడుతున్నారు.
ఈ మూవీ హిట్ తో హీరో సాయిధరమ్ తేజ్, డైరెక్టర్ కార్తీక్ దండు సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి సీక్వెన్స్ కూడా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడే కాకపోయినా, కొంతకాలం తర్వాత దీనికి సీక్వెన్స్ తీస్తామంటూ డైరెక్టర్ సైతం ప్రకటించాడు.
ఈ సంగతి పక్కనపెడితే, ఈ సినిమాని మొదట తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే తెరకెక్కించారు. రెస్పాన్స్ బాగుంటే ఇతర భాషల్లో డబ్ చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా హిట్ టాక్ రావడంతో.. హిందీలో డబ్ చేస్తున్నారు. హిందీలో ఈ సినిమాను మే 5వ తేదీన విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
అక్కడ కూడా చూడటానికి పెద్దగా సినిమాలు ఏమీ లేకపోవడంతో.. ఈ సినిమాపై చిత్ర బృందం మంచి హోప్స్ పెట్టుకుంది. కచ్చితంగా హిట్ అవుతుందని ఎదురుచూస్తున్నారు. మంచి కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నారు. అలాగే మలయాళం, తమిళ్ రిలీజ్ కు కూడా రెడీ అయ్యారు.
టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లో ఈ మద్య బాగానే సత్తా చాటుతున్నాయి. ఆర్ఆర్ఆర్, బాహుబలి, నిఖిల్ కార్తీకేయ2 ఇవన్నీ.. అక్కడ సత్తాచాటినవే. మరి ఎలాంటి అంచనాలు లేని విరూపాక్ష హిందీలో ఏమేర సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్తా మేనన్ నటించింది. సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కేవలం 4 రోజుల్లో విరూపాక్ష మూవీ రూ.24.35 కోట్లు వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ట్రేడ్ వర్గాల గ్రాస్ ప్రకారం ఇది దాదాపు రూ.44 కోట్లు అయితే.. మేకర్స్ అధికారిక ప్రకటన ప్రకారం 'విరూపాక్ష' మూవీ రూ.50 కోట్లు మార్క్ ను టచ్ చేసింది. సాయిధరమ్ తేజ్ కెరీర్ లో మూవీ ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టుకోవటం.. అది కూడా యాబై కోట్లు మార్క్ ను టచ్ చేయటం ఇదే తొలిసారి అవుతుంది.