తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు నిర్మించిన జీకే రెడ్డి తనయుడు విశాల్. నిజానికి అతను హీరో కావాలని అనుకోలేదు. దర్శకుడు కావాలని అనుకున్నాడు. ఆ విభాగంలో పని చేశాడు కూడా. విశాల్ అన్న హీరో కావాలనుకున్నాడు. కానీ జరిగింది వేరు. విశాల్ హీరో అయ్యాడు. అతడి అన్నయ్య నిర్మాతగా మారాడు. ఐతే తాను హీరోగా మారడంలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు పాత్ర కీలకం అంటున్నాడు విశాల్. తనలో హీరో లక్షణాలున్నాయని.. హీరోను చేయమని తన తండ్రికి ముందుగా సలహా ఇచ్చింది మోహన్ బాబే అని విశాల్ వెల్లడించడం విశేషం. విశాల్ కొత్త సినిమా ‘అభిమన్యుడు’ విజయవంతం అయిన నేపథ్యంలో మంచు విష్ణు అతడికి అభినందనలు తెలపగా.. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు విశాల్.
నేను హీరో కావడానికి మీ నాన్నే కారణం.. ఇప్పుడు నేనీ స్థాయిలో అందుకు ఆయన మా నాన్నకిచ్చిన సలహా వల్లే. ‘అభిమన్యుడు’ సక్సెస్ లో కూడా ఆయనకు క్రెడిట్ ఉంది.. అని విశాల్ అన్నాడు. చెల్లమే (తెలుగులో ప్రేమ చదరంగం) అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయిన విశాల్.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. గత కొన్నేళ్లలో వైవిధ్యమైన థ్రిల్లర్లతో పెద్ద హిట్లు కొట్టాడు. ఐతే ఒకప్పుడు విశాల్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉండేది. తర్వాత దాన్ని పోగొట్టుకున్నాడు. చాన్నాళ్ల తర్వాత ‘అభిమన్యుడు’తో అతడికి మంచి విజయం దక్కింది. ఈ చిత్రాన్ని మంచి టైమింగ్ చూసి.. బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేశాడు విశాల్. ఈ చిత్రానికి మంచి టాక్ తో పాటు ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. పోటీగా వచ్చిన రెండు తెలుగు సినిమాలు తేలిపోవడం దీనికి బాగానే కలిసొస్తోంది.