MAA త‌క‌రారు! వాళ్ల రాజీనామాతో ఇత‌రుల‌కు ప‌ద‌వులు!!

Update: 2021-12-14 14:30 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల్లో మంచు విష్ణు గెలిచి అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. యువ అధ్య‌క్షుడి సార‌థ్యంలో నిర్ణ‌యాలు అంతే దూకుడుగా ఉన్నాయన్న టాక్ ఉంది. సంక్షేమ ప‌థ‌కాల అమలు స‌హా సీనియ‌ర్ ఆర్టిస్టుల‌కు ఫించ‌న్ల వ్య‌వ‌హారంపైనా రివ్యూలు చేస్తున్నారు. ఇంకో వారంలో మూవీ ఆర్టిస్టుల సంఘానికి భ‌వంతి నిర్మాణంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తున్నామ‌ని వెల్ల‌డించింది ఈ కొత్త కార్య‌వ‌ర్గం.

అలాగే మెడిక‌వ‌ర్ వాళ్ల‌తో టై అప్ పెట్టుకుని ఆర్టిస్టులంద‌రికీ ఉచిత హెల్త్ క్యాంప్ లు నిర్వ‌హిస్తున్నారు. ఇక‌పోతే మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామాల్ని ఆమోదిస్తూ ఇటీవ‌లే కొత్త అధ్య‌క్షుడు మంచు విష్ణు త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌కాష్ రాజ్ - నాగ‌బాబు మా స‌భ్య‌త్వానికి రాజీనామాలు చేసినా కానీ దానిని ఆమోదించ‌లేదు. వారు ఎప్ప‌టిలానే స‌భ్యులుగా కొన‌సాగుతార‌ని వెల్ల‌డించారు.

తాజా స‌మాచారం మేర‌కు.. రాజీనామాలు చేసిన 11 మంది స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసామ‌ని విష్ణు టీమ్ వెల్ల‌డించింది. రాజీనామాలు ఉప‌సంహ‌రించుకోవాల‌ని ప‌ద‌వుల్లో కొన‌సాగాల‌ని కోరామ‌ని నెల‌రోజులు గ‌డువు ఇచ్చినా ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గాలు స్పందించ‌లేద‌ని విష్ణు వ‌ర్గం చెబుతోంది. అందుకే రాజీనామాల్ని ఆమోదించాల్సి వ‌చ్చింది. మునుముందు ప‌నుల్లో జాప్యం జ‌ర‌గ‌కుండానే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సొచ్చింద‌ని చెబుతున్నారు. ఇక‌పై మా అభివృద్ధిలో ప‌రుగులు తీస్తుంద‌ని ప్ర‌స్తుత కార్య‌వ‌ర్గం ధీమాను వ్య‌క్తం చేస్తోంది.

మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రుల‌తో ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయడానికి ఒప్పందం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్‌ వైద్యులు అనిల్ .. మా జనరల్ సెక్రటరి రఘుబాబు.. ట్రెజరర్ శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News