వైవా హర్ష పెళ్లి హడావుడి మామూలుగా లేదుగా?

Update: 2021-10-22 03:49 GMT
సాదాసీదా కుర్రాడు. ఏ మాత్రం ప్రత్యేకత లేనోడు.. భారీకాయంతో బొద్దుగా ఉంటూ వాట్సాప్ పోస్టుల్లోనూ.. ఫేస్ బుక్ పోస్టుల్లో వైరల్ అయ్యే పంచ్ పోస్టులకు ఫేస్ గా ఒకప్పుడు విపరీతంగా వాడే వైవా హర్ష కాస్తా ఇటీవల కాలంలో పాపులర్ నటుడిగా మారిపోవటం తెలిసిందే. వైవా సిరీస్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు.. ఇటీవల కాలంలో పలు సినిమాల్లో హాస్య నటుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదుగుతున్న వైవా హర్ష తాజాగా ఒక ఇంటి వాడయ్యాడు.

అతడి పెళ్లి వేడుక ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అతడి పెళ్లి ముచ్చట సోషల్ మీడియాలో పెద్దగా హడావుడి చేయలేదు. హైదరాబాద్ మహానగరంలోని ఒక ఫంక్షన్ హాల్లో వేడుకగా జరిగిన ఈ పెళ్లి వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లికుమార్తె ఎవరన్నది దానిపై ఆసక్తి నెలకొంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ పెళ్లి వేడుక ఏడు రోజుల పాటు వేడుకగా సాగటం.

ఇక.. పెళ్లి కుమారుడైన హర్ష.. తన పెళ్లి ఊరేగింపు సందర్భంగా అతని స్నేహితులే కాదు.. అతను ఎంతలా ఎంజాయ్ చేశారన్న విషయాన్ని తెలియజేసే చిట్టి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పెళ్లి వేడుకకు సినీ ప్రముఖులు పలువురు హాజరై.. కొత్త దంపతుల్ని ఆశీర్వదించారు. కలర్ ఫోటోతో తనదైన నటనతో మెప్పించి.. అతడికి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి. మొత్తానికి జీవితంలో కొత్త జర్నీని స్టార్ట్ చేసిన వైవా హర్షాకు ఆల్ ద బెస్ట్.
Full View
Tags:    

Similar News