దాదాపు వంద కోట్ల షేర్ సాధించింది మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’. నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ ఈ సినిమా బద్దలు కొట్టేసింది. కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి’ రికార్డులు కూడా బద్దలయ్యాయి. ఇంత పెద్ద హిట్టు కొట్టినా ఈ చిత్ర దర్శకుడు వినాయక్ కు అంత డిమాండేమీ లేదు. రీమేక్ సినిమా కావడంతో ఈ సినిమా తాలూకు సక్సెస్ లో వినాయక్ కు పెద్దగా క్రెడిట్ రాలేదు. మొత్తం క్రెడిట్ అంతా చిరు ఖాతాలోకే వెళ్లిపోయింది. ఈ సినిమా ఎలా ఉంటుందని ఆలోచించకుండా జనాలందరూ చిరును చూడటానికే థియేటర్లకు వెళ్లారన్న సంగతి వాస్తవం. సినిమా ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టడానికి కూడా చిరునే కారణం. దాదాపుగా ‘కత్తి’ని దించేయడం తప్ప వినాయక్ ఈ సినిమా విషయంలో పెద్దగా చేసిందేమీ లేదు. దర్శకుడిగా సినిమాలో అతడి ముద్రే కనిపించదు. అందుకే అతడికి పెద్దగా పేరు రాలేదు.
‘ఖైదీ నెంబర్ 150’ విడుదలై దాదాపు నెల రోజులు కావస్తున్నా వినాయక్ తర్వాతి సినిమాకు సంబంధించిన కబురేమీ వినిపించడం లేదు. తనతో పని చేయడానికి టాలీవుడ్లో ఏ స్టార్ హీరో కూడా సిద్ధంగా లేడిప్పుడు. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్.. ప్రభాస్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్.. రవితేజ.. ఇలా ప్రతి స్టార్ హీరో కూడా బిజీగానే ఉన్నాడు. వీరిలో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే వినాయక్ తో పని చేయడానికి ఆసక్తి చూపించాడు. ఇద్దరి కాంబినేషన్లో ‘అదుర్స్-2’ రావచ్చొన్న ప్రచారం జరిగింది. ఇంకో ప్రాజెక్టు కూడా అనుకున్నారు. కానీ ఏదీ కూడా వర్కవుట్ కాలేదు. ‘అఖిల్’ ఫ్లాప్ తర్వాత వినాయక్ తో పని చేయడానికి స్టార్లెవ్వరూ కూడా అంత ఆసక్తి చూపించట్లేదు. గత కొన్నేళ్లలో ప్రేక్షకుల అభిరుచి మారింది. వైవిధ్యమైన సినిమాలకు పట్టం కడుతున్నారు. వినాయక్ చూస్తే అలా కొత్త కథల్ని డీల్ చేసేలా కనిపించట్లేదు. పైగా అతను రచయితలపై ఆధారపడతాడు తప్ప సొంతంగా స్క్రిప్టు రాసుకోలేకపోవడం కూడా మైనస్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ‘ఖైదీ నెంబర్ 150’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా వినాయక్ తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఐతే స్టార్లెవ్వరూ అందుబాటులో లేని నేపథ్యంలో వినాయక్ ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/