మా కర్మకు ‘అఖిల్’ కథ నచ్చింది-వినాయక్

Update: 2017-01-06 08:06 GMT
అక్కినేని అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ విషయంలో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. నాగార్జున బాగా టైం తీసుకుని ఈ సినిమా కథను ఓకే చేయడం.. వి.వి.వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం.. కోన వెంకట్ రచనా సహకారం అందించడం.. ఇంకో ఇద్దరు ముగ్గురు రచయితలు కలిసి స్క్రిప్టు వండటంతో ఈ సినిమా కచ్చితంగా అఖిల్ కు శుభారంభాన్నిస్తుందని అంతా అనుకున్నారు. కానీ సినిమా డిజాస్టర్ అయింది. అందరికీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. మినిమం గ్యారెంటీ సినిమా ఇస్తాడని పేరున్న వినాయక్ కు కూడా ఈ సినిమా ఓ పీడ కల అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా తనకెంత వేదన మిగిల్చిందో వివరించాడు వినాయక్. కథ ఎంచుకోవడంలోనే పొరబాటు జరిగిందని వినాయక్ అభిప్రాయపడ్డాడు.

‘‘అఖిల్ సినిమాను మేం తీయడం బాగానే తీశాం. టేకింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. నా బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాననుకుంటున్నా.  ఆ సినిమా కథకి ఏం అవసరమో.. ఏం అనుకున్నామో అదంతా చేశాం. తీయడంలో లోపం జరుగలేదు. టేకింగ్ లో ఎక్కడా నాన్సెన్స్ లేదు. ఐతే కథను నాన్సెన్స్ అని ఫీలైతే ప్రతిదీ బాగాలేదనే అనిపిస్తుంది. సినిమాలో మంచి విషయాలున్నా పోతాయి. ‘అఖిల్’ సినిమా విషయంలో అదే జరిగింది. మా కర్మకు ఆ కథ అప్పుడు నచ్చింది. సినిమా రిజల్ట్ చూశాక రెండు మూడు నెలలు చాలా బాధను అనుభవించాను. ప్యాంట్ షర్ట్ వేసుకుని బయటకే రాలేదు. అఖిల్ తొలి సినిమా ఇలా అయిందే అని చాలా బాధపడ్డాను. నా కెరీర్ గురించి.. నాకొచ్చిన చెడ్డ పేరు గురించి ఆలోచించలేదు. అఖిల్ విషయమే బాధపెట్టింది. ఈ సినిమాకు నాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఉంటే వాళ్లకు డబ్బులు సెటిల్ చేశాను. నా రెమ్యూనరేషన్ కూడా వదిలేశాను. అఖిల్ కు నా తరఫున ఒక హిట్టివ్వాలి. అది నా బాధ్యత’’ అని వినాయక్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News