పవనుడికి వినాయకుడి విన్నపం

Update: 2018-02-05 10:11 GMT
ఇకపై సినిమాలు చేయనంటూ మరోసారి నొక్కి వక్కాణించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ మాట చాలామందిని బాధపెట్టింది. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవే స్వయంగా పవన్ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలోచన మార్చుకోవాలని.. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కొనసాగాలని కోరాడు. ఇప్పుడు సీనియర్.. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ సైతం పవన్ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరాడు. మెగా అభిమానులందరి తరఫున తాను విజ్ఞప్తి చేస్తున్నానని.. పవన్ కళ్యాణ్ సినిమాలు మానేయొద్దని.. రాజకీయాల్లో మంచి చేస్తూనే.. ఉన్నత శిఖరాలకు ఎదుగుతూనే సినిమాల్లో కొనసాగాలని వినాయక్ కోరాడు.

ఇక చిరు.. పవన్‌ ల మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గురించి చెబుతూ.. అతణ్ని చూస్తుంటే చిరు-పవన్ ఇద్దరినీ కలిపి చూస్తున్నట్లు ఉంటుందని చెప్పాడు. సినిమాలో కొన్నిచోట్ల అతడిని చూస్తే చిరు కనిపించాడని.. ఇంకొన్ని చోట్ల పవన్ కనిపించాడని అన్నాడు. మావయ్యలిద్దరి లాగే అతడికీ కష్టపడే గుణం ఉందని.. వాళ్లిద్దరి స్థాయికి అతను చేరుకుంటాడని వినాయక్ చెప్పాడు. ‘ఇంటిలిజెంట్’ సినిమాలో పాటలు మెగా అభిమానులకు కనువిందే అని.. తేజు డ్యాన్సులు ఇరగదీశాడని వినాయక్ అన్నాడు. ‘ఇంటిలిజెంట్’ చాలా పెద్ద హిట్ కాబోతోందని.. ఈ సినిమా అందరికీ సంతోషాన్నిస్తుందని ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో వినాయక్ ధీమా వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News