థియేటర్లు అమ్మేసిన అగ్ర దర్శకుడు

Update: 2018-12-28 04:34 GMT
ఇండస్ట్రీలో మంచి పేరు, పలుకుబడి ఉన్న దర్శకుడు వివి వినాయక్. ఆయన కొద్దికాలం వరకు స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీశాడు. గ్రాండ్ హిట్స్ కొట్టాడు. సినిమాల్లో వచ్చిన సంపాదనతోనే తన స్వగ్రామానికి దగ్గరగా విశాఖపట్నంలో థియేటర్లను కొనుగోలు చేశారు.. ఒకప్పుడు విశాఖలో ఫేమస్ అయిన కమల్, రాజ్ కమల్ అనే జంట థియేటర్లు ఉండేవి. ఆ తర్వాత వాటిలో ఒక దాన్ని కొనుగోలు చేసిన వీవీ వినాయర్ వీ మ్యాక్స్ పేరిట థియేటర్ల సముదాయాన్ని ఏర్పాటు చేశారు. వినాయక్ సోదరుడు విజయ్ వీటి వ్యవహారాలను చూసుకునేవారు.

తాజాగా వీవీ వినాయక్ కు మంచి బేరం వచ్చినట్టు తెలిసింది. ఓ హైపర్ మార్కెట్ చెయిన్ కంపెనీతో ఆ థియేటర్ కాంప్లెక్స్ ను కొనుగోలు చేసినట్టు సమాచారం. మంచి రేటును ఇస్తామనడంతో వినాయక్ ఆ థియేటర్ ను తాజాగా అమ్మేశాడు.

తాజాగా చెయిన్ సంస్థ వినాయక్ థియేటర్లను పడగొట్టి అక్కడ విశాఖలోనే అతిపెద్ద హైపర్ మార్కెట్ ను ఏర్పాటు చేస్తోందట..ఈ నెలాఖరు వరకు కొనుగోలు దారు పడగొట్టి అక్కడ తనకు అనుకూలంగా నిర్మాణాలకు ప్లాన్ చేశారు. అలా వీ మాక్స్ అనగానే వినాయక్ థియేటర్లు గుర్తుకు వచ్చే విశాఖ వాసులకు ఇక ఆ  థియేటర్లు కనిపించవన్నమాట..
    

Tags:    

Similar News