రూ100 కోట్లకు పైగా షేర్.. రూ.160 కోట్లకు పైగా గ్రాస్.. ఇదీ ‘ఖైదీ నెంబర్ 150’ స్టామినా. ఇలాంటి సినిమాకు దర్శకత్వం వహించిన వి.వి.వినాయక్ కు తాను కోరుకున్న స్థాయి పెద్ద హీరో దొరకట్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్లందరూ ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉన్నారు. పైగా రొటీన్ మాస్ మసాలా సినిమాలకు కాలం చెల్లిపోతున్న నేపథ్యంలో ఆ తరహా సినిమాలే చేసే వినాయక్ తో పని చేయడానికి స్టార్లు అంత ఆసక్తిగా లేరన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో సాయిధరమ్ తేజ్ లాంటి మీడియం రేంజి హీరోతో సర్దుకుపోవడానికి వినాయక్ రెడీ అయినట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు వినాయక్ టార్గెట్ మారినట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతానికి తన రచయితల బృందంతో కలిసి ఒక యాక్షన్ స్టోరీ అయితే ప్రిపేర్ చేయిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్.. వక్కంతం వంశీ సినిమా తర్వాత బన్నీ తనతో సినిమా చేసేలా ఒప్పించాలని భావిస్తున్నాడు వినాయక్. ఐతే ముందు స్క్రిప్టు రెడీ అయ్యాకే వినాయక్ ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశాలున్నాయి. బన్నీకైతే ఒక మాట చెప్పి ఉంచాడట వినాయక్. స్క్రిప్టు నచ్చితే వినాయక్ తో పని చేయడానికి బన్నీ అభ్యంతరం చెప్పకపోవచ్చేమో. ఓవైపు క్లాస్ ఎంటర్టైనర్లు చేస్తూనే ‘రేసుగుర్రం’ లాంటి మాస్ మసాలా సినిమాతోనూ బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/