వాల్తేర్ వీరయ్య- వీర సింహారెడ్డి రెండూ భారీ బడ్జెట్ తో తీసిన అగ్ర హీరోల చిత్రాలు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ రెండు సినిమాల కోసం సుమారు 180 కోట్లు పైగా బడ్జెట్ వెచ్చించిందని టాక్ వినిపించింది. అందువల్ల భారీ ధరలకు పంపిణీవర్గాలు ఈ సినిమాల రిలీజ్ హక్కులను కొనుగోలు చేశాయని.. పెద్ద మొత్తాలకు ప్రీరిలీజ్ బిజినెస్ సాగిందని కథనాలొచ్చాయి.
సంక్రాంతి కానుకగా జనవరి 12న వీర సింహారెడ్డి.. జనవరి 13న వాల్తేరు వీరయ్య రిలీజవుతున్నాయి. సెలవులను ఎన్ క్యాష్ చేసుకోవడానికి ఆస్కారం ఉందని నిర్మాతలు పంపిణీదారులు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఎంత భారీ కలెక్షన్లు వచ్చినా పెట్టుబడులు రికవరీ అవ్వాలంటే తొలి వారం టికెట్ పెంపు అనుమతుల్ని ప్రభుత్వాలు మంజూరు చేయాల్సి ఉంటుందని ఐదో షో వేసుకునేందుకు ఇరు రాష్ట్రాలు అనుమతించాలని పంపిణీవర్గాలు ఎగ్జిబిటర్లు కోరుకున్నారు.
ఇప్పటికే తెలంగాణలో స్పెషల్ షోలకు నిర్మాతలు అనుమతులు తీసుకున్నారని.. ఉదయం 5 గంటల నుంచి షోలు ప్రారంభమవుతాయని కథనాలొచ్చాయి. స్పెషల్ షోలు టిక్కెట్ల రేట్ల పెంపుదలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసే వీలున్నా కానీ ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అందువల్ల ఎగ్జిబిటర్లు బయ్యర్లలో కొంత ఆందోళన అలుముకుంది. సంక్రాంతి పెద్ద విడుదలలను దృష్టిలో ఉంచుకుని టికెట్ పెంపుతో రికవరీ సాధ్యమని భావించారు.
అయితే ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ లకు ఏపీ ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. ఇరు సినిమాల టిక్కెట్ల ధరలను తొలివారంలో పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతించిందని కథనాలొచ్చాయి. బాలయ్య వీరసింహా రెడ్డి - చిరు వాల్తేరు వీరయ్య చిత్రాలకు రూ. 45 ప్లస్ GST పెంపును అనుమతిస్తూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వును ఇచ్చిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో స్టాండర్డ్ టిక్కెట్ ధరలు వేరు. ఇక సంక్రాంతి రిలీజ్ లకు ధరలు వేరు అని ఖాయమైంది.
తెలంగాణ మల్టీ ప్లెక్స్ లలో రూ. 295 వరకు టిక్కెట్ ల ధరను పెంచుకునే వెసులుబాటు ఉండగా..ఏపీలోను ఇంచుమించు ఇవే ధరలు ఉండేందుకు వీలుందని చెబుతున్నారు. సినీపరిశ్రమకు అనుకూలంగా ఇరు ప్రభుత్వాలు స్పందించడం ఆసక్తిని కలిగిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.