స్టార్ క్రికెటర్స్ గ్రౌండ్ లోకి దిగి బంతిని వీర బాదుడు బాదుతూ.. పరుగుల వరద పారిస్తుంటారు. అయితే ఇప్పుడు కొంతమంది క్రికెటర్స్ తెలుగు మూవీస్ ని వాయిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమవడంతో.. పలువురు క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. అనుకోని విధంగా వచ్చిన ఈ హాలిడేస్ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తూనే తమ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్ - కెవిన్ పీటర్సన్ అభిమానులకు నెటిజన్లకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ మధ్య సెలబ్రిటీలు టిక్ టాక్ వీడియోలు చేయడం మాములే అయిపోయింది. కానీ క్రికెటర్స్ చేస్తే ఎలా ఉంటుందో ఈ ఇద్దరు చూపిస్తున్నారు. అందులోనూ తెలుగు సినిమాలకి సంబందించినవి చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో తెలియజేస్తున్నారు.
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ తన భార్య కాండీస్ వార్నర్ తో కలిసి 'అల వైకుంఠపురంలో' సినిమాలోని 'బుట్టబొమ్మ' 'రాములో రాములా' పాటలకు స్టెప్పులేస్తూ టిక్ టాక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు వార్నర్ ముద్దుల కూతురు ఇండిరే కూడా ఈ వీడియోలలో పాల్గొని డాన్స్ చేసింది. ఇవే కాకుండా వార్నర్ చేసిన 'సన్నజాజి పడక' సాంగ్.. 'పోకిరి' సినిమా డైలాగ్ లకు టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. కాగా తాజా వీడియోలో వార్నర్ 'రాములో రాములా' సాంగ్ కొత్తగా ప్రజెంట్ చేశాడు. డాన్స్ కి బదులు సోలోగా స్టైలిష్ గా ఫినిష్ చేశాడు. స్టార్ క్రికెటర్ ఇలా తమ సినిమాలోని పాటలకు స్టెప్స్ వేయడంతో హీరో అల్లు అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఆయన్ని ప్రశంసించారు. డేవిడ్ వార్నర్ వీడియోలకు మంచి స్పందన రావడంతో ఆయన వరుస వీడియోలు చేస్తున్నారు.
అయితే డేవిడ్ వార్నర్ తో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా ఇటీవలే 'కొంటెగాన్ని కట్టుకో' సాంగ్ కి తనదైన హావభావాలతో చేసిన వీడియోస్ వైరల్ అయ్యారు. ఇలా క్రికెటర్లు సైతం తెలుగు పాటల పై డైలాగ్స్ పై టిక్ టాక్స్ చేయడంతో తెలుగు వారు ఖుషీ అవుతున్నారు. కొంతమంది మాత్రం ఈ క్రికెటర్స్ ఏంటి తెలుగు సినిమాల మీద పడ్డారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు 'గ్రౌండ్ లో బాల్ ని వాయించే క్రికెటర్స్ ఇప్పుడు లాక్ డౌన్ లో తెలుగు మూవీస్ ని వాయిస్తున్నారు' అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా లాక్ డౌన్ లో అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. దీంతో మరిన్ని వీడియోస్ చేయమని సజెషన్స్ ఇస్తున్నారు. మరి వీళ్ళు నెక్స్ట్ 'మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్' అంటూ వస్తారేమో చూడాలి.