థియేటర్లు ఓపెన్ చేసినా కూడా కొందరు నిర్మాతలు కావాలని సినిమాల విడుదలను అడ్డుకుంటున్నారు అంటూ ఇండస్ట్రీలో ఒక వర్గం వారు ఆరోపిస్తున్నారు. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలను కూడా విడుదల కాకుండా కొందరు ప్రయత్నిస్తున్నారు అంటూ వారు చేస్తున్న ఆరోపణలకు భారీగానే మద్దతు లభించింది. ఈ సమయంలో థియేటర్లు ఓపెన్ కాకుండా వచ్చే ఏడాది వరకు వాయిదా వేయాలనేది కొందరు ప్రయత్నంగా మరి కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మీడియా ముందుక వచ్చి థియేటర్ల ఓపెన్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు.
సినిమాల విడుదలకు నిర్మాతలు సిద్దంగానే ఉన్నారు. థియేటర్లలో సినిమాలను విడుదల కాకుండా ఎవరు అడ్డుకోవడం లేదు. చిన్న సినిమాలు విడుదలకు సిద్దంగా ఉంటే విడుదల చేసుకోవచ్చు అంటూ మేము చెబుతున్నాం. పెద్ద సినిమాల నిర్మాతలు మాత్రం మరికొన్నాళ్లు ఆగాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. చిన్న సినిమాల విడుదలను ఎవరు ఆపడం లేదని ఎవరైనా సినిమాలు విడుదల చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని సినిమాలు కూడా విడుదల అయ్యాయి.. విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. కనుక ఇండస్ట్రీలో కొందరు చేస్తున్న ఆరోపణలను పట్టించుకోనవసరం లేదు అంటూ సి కళ్యాణ్ పేర్కొన్నాడు. సంక్రాంతి తర్వాత నుండి థియేటర్లకు జనాలు క్యూ కడతారనే నమ్మకం ఉంది.. ఆ తర్వాత పెద్ద సినిమాలు కూడా వస్తాయనే ఆశాభావంను ఆయన వ్యక్తం చేశాడు.