దర్శకుడు పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. వెబ్ సిరీస్ లు త్వరలో సినిమా రంగాన్ని మించిపోనున్నాయని.. భవిష్యత్ అంతా వాటిదేనంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అయితే.. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదని ఇండస్ట్రీ నిపుణులు చెప్పడమే కాదు.. ఇందుకు కారణాలు కూడా వివరిస్తున్నారు.
అసలు మొదటగా ఓ థియేటర్ కి వెళ్లి పెద్ద స్క్రీన్ పై లేటెస్ట్ టెక్నాలజీతో.. చీకటి ప్రదేశంలో సినిమా చూసే అనుభూతిని బుల్లితెరపై చూసే టీవీ సిరీస్ లు.. స్మార్ట్ ఫోన్ లో చూసే వెబ్ సిరీస్ లు ఏ మాత్రం పోటీ ఇవ్వలేవనే విషయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. ఇప్పటికే గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నా.. అవేమీ సినిమాలు ఇసుమంత కూడా కదల్చలేకపోయాయి. అలాగే ప్రముఖ నెట్వర్క్స్ కోసం నెలకు 500 చొప్పు సబ్ స్క్రిప్షన్ కట్టి వెబ్ సిరీస్ లు చూడ్డం కూడా క్లిష్టమైన విషయమే.
ఎందుకంటే.. వీటిన్నిటికీ తాతలాంటి యూట్యూబ్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది. నెట్ ఫ్లిక్స్ వంటి కొన్ని సర్వీసులు పలు దేశాల్లో పాపులర్ అయినా.. ఇక్కడ మాత్రం అలాంటివి ఇప్పట్లో కష్టం. ఇప్పుడు ఇంటర్నెట్ పెనట్రేషన్ ఇంతగా ఒక్కసారిగా పెరగడానికి జియో ఉచిత ఆఫర్ హెల్ప్ చేసింది. అది కూడా ఎన్నాళ్లో ఇవ్వదు కదా. అదీ సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/