కరోనా కారణంగా ఇండియన్ బాక్సాఫీస్ భారీ సంక్షోభంలో ఉంది. సౌత్ లో కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా ఉత్తరాదిన మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ థియేట్లరు ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. కరోనా భయం ఇంకా ఉంది. సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో సినిమాల సందడి ఇప్పుడిప్పుడే మొదలు అయ్యింది. తెలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల అవుతున్నాయి. ఈ సమయంలో కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్దకు వస్తున్నాయి. ఈసమయంలో చాలా పెద్ద సినిమాలను.. సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న సినిమాలను మాత్రమే జనాలు పట్టించుకుంటున్నారు. ఈ సమయంలో హాలీవుడ్ సినిమా తెలుగు వర్షన్ కు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.
హాలీవుడ్ బాండ్ మూవీ 'నో టైమ్ టు డై' పై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. గత ఏడాదిలోనే ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. వేల కోట్ల వసూళ్ల టార్గెట్ తో విడుదల అయిన నో టైమ్ టు డై ఇండియాలో కూడా సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం జరిగింది. సౌత్ లో అత్యధికంగా థియేటర్లలో విడుదల అయినట్లుగా తెలుస్తోంది. నేడు విడుదల అయిన ఈ సినిమాకు బుకింగ్స్ నార్మల్ గా ఉన్నాయి. కాని వీకెండ్స్ అయిన శని మరియు ఆదివారాల్లో భారీగా ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
బాండ్ అభిమానులు పెద్ద ఎత్తున ఉంటారు. జేమ్స్ బాండ్ సినిమా అనగానే కళ్లు మూసుకుని చూడాలి.. చూసేయాలి అనుకునే వారు చాలా మంది ఉంటారు. వారు అంతా కూడా వీకెండ్స్ లో నో టైమ్ టు డై సినిమాను వెండి తెరపై ఆస్వాదించేందుకు ఇప్పటికే టికెట్స్ ను బుక్ చేసుకోవడం జరిగింది. బాండ్ అభిమానుల క్యూలతో సినిమా థియేటర్లు కళ కళలాడబోతున్నాయి. బుకింగ్ ద్వారానే భారీ మొత్తంలో కలెక్ట్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. టాక్ తో సంబందం లేకుండా బాండ్ సినిమాకు వేల కోట్ల వసూళ్లు నమోదు అవ్వడం చాలా కామన్ విషయం. తెలుగు రాష్ట్రాల నుండి కూడా పదుల కోట్లలో వసూళ్లు ఉంటాయని అంచనా.