నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకుని వేరైన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు భార్యాభర్తలుగా కలిసి ఉన్నప్పుడు కోల్గేట్ టూత్ పేస్ట్ కి బ్రాండ్ అంబాసిడర్లుగా బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ జంటకి పెళ్లైన తర్వాత ఖాతాలోకి వచ్చిన బ్రాండ్ ఇది. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ కి చైతూ..కోల్గేట్ సాల్ట్ కి సమంత ప్రమోటర్లుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇద్దరూ వేరయ్యారు.
దీంతో సదరు బ్రాండ్ పరిస్థితి ఏంటన్నది ముంబై యాడ్ ఏజెన్సీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. భార్యాభర్తలుగా వేరైనా ఇప్పుడు కలిసి ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తారా? లేక ఎవరో ఒకరు ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటారా? అంటూ వాడివేడిగా చర్చ సాగుతోంది.
బ్రేకప్ సమయంలో సమంత ఎంత మనోవేదనకు గురైందో ఆమె పబ్లిక్ ప్లాట్ ఫాం పై చాలాసార్లు చెప్పుకొచ్చింది. చైతన్య ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నా సామ్ మాత్ర తన బాధని వివిధ రూపాల్లో వ్యక్త పరిచే ప్రయత్నం చేసింది. ఆ కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైంది. ప్రస్తుతం కెరీర్ పరంగా చై-సామ్ ఎవరికి వారు బిజీగా ఉన్నారు.
గతాన్ని మర్చిపోయి మునుపటిలా ముందుకు సాగిపోతున్నారు. ఈ నేపథ్యంలో వృత్తి పరంగా వేరయ్యే ఛాన్స్ తక్కువగానే ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ఆ రకంగా భావిస్తే గనుక కోల్గేట్ సంస్థకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
అయితే చైతన్య సౌమ్యుడు...మృధుస్వభావి. విడాకుల సమయంలో పెయిన్ అంతా పంటికింద భరించాడు. వృత్తిపరమైన కమిట్ మెంట్లతో అన్నిటినీ బయట పడకుండా దాచాడు. హుందాతనం మెయింటెయిన్ చేసాడని అభిమానులు భావిస్తున్నారు. విడాకుల గురించి...వ్యక్తిగత జీవితం గురించి గానీ చైతూ ఏనాడు స్పందించలేదు.
మరి అలాంటి వ్యక్తిత్వం గల చైతన్య సామ్ తో ఈ విషయంలో రాజీకి రాగలడా? అన్నది చూడాలి. సాధారణంగా విడాకుల వ్యవహారం అనేది బాలీవుడ్ సెలబ్రిటీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇప్పటికే విడాకులు తీసుకున్న వారు ఉన్నారు. నాగార్జున (మొదటి భార్యతో)..సుప్రియ..సుమంత్... విడాకులు తీసుకున్న వారే.