నాని కథానాయకుడిగా శ్యామ్ సింఘరాయ్ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. టాక్సీవాలా ఫేం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఒక భారీ సెట్ వేయాల్సి వచ్చిందని దానికోసమే 6.5 కోట్లు ఖర్చు చేశారని కథనాలొచ్చాయి. అంత పెద్ద మొత్తం ఒక్క సెట్ కే ఖర్చు చేస్తే బడ్జెట్ అదుపుతప్పుతుంది కదా! నానీకి వర్కవుటవుతుందా?! అంటూ సందిగ్ధత వ్యక్తమైంది. అయితే దీనికి చిత్రబృందం వద్ద సరైన సమాధానం ఉంది.
హైదరాబాద్ శివార్లలోని పది ఎకరాల భూమిలో కోల్ కతాను పోలిన భారీ సెట్ కోసం అంత పెట్టుబడి పెట్టడానికి ప్రత్యేక కారణముందని తెలిసింది. ఈ ప్రత్యేక సెట్ లో 20 నిమిషాల నిడివితో సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది. అన్ని ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే మేము కోల్ కతాకు వెళితే 6.5 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాకుండా కోవిడ్ భద్రతా చర్యలు.. బెంగాల్ ఎన్నికల సమయంలో షూటింగ్ మరింత ప్రమాదానికి గురి చేస్తాయి. కాబట్టి ఈ నిర్ణయం సరైనది అని సమర్థించుకున్నారు.
వీ తర్వాత టక్ జగదీస్ లో నటించిన నాని ఈ పీరియాడిక్ మూవీ తనకు బిగ్ బ్రేకింగ్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నాడు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.