యంగ్ టైగర్ ఎన్టీఆర్, జక్కన్ననాలుగవ సారి కలిసి పని చేసిన చిత్రం 'ట్రిపుల్ ఆర్'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మార్చి 25న అత్యంత భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసి వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికే 1000 కోట్లకు మించి వరల్డ్ వైడ్ గా వసూళ్లని రాబట్టిన ఈ మూవీ ఇప్పటికీ అదే జోరుతో దూసుకుపోతోంది.
ఇదిలా వుంటే ఈ చిత్రం విడుదలైన దగ్గరి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళిపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తమ హీరో ఎన్టీఆర్ ని కావాలనే సినిమాలో తగ్గించి చూపించారని. చరణ్ పాత్రకు భారీ స్కోప్ ఇచ్చి ఎన్టీఆర్ పాత్ర ప్రాధాన్యతని తగ్గించారని విమర్శలు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఎన్టీఆర్ ని ట్రిపుల్ ఆర్ లో సెకండ్ హీరోని చేశారంటూ జక్కన్నపై గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ లు చేస్తున్నారు.
తాజాగా రాజమౌళికి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేసిన ఎన్టీఆర్ అభిమానులు ఆయనపై మళ్లీ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు. 'బాహుబలి 2' సమయంలో రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో అది. దాన్నే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాయింట్ అవుట్ చేస్తూ జక్కన్నని ట్రోల్ చేయడానికి బలమైన కారణం వుంది. 'బాహుబలి 2' తరువాత రాజమౌళి మంచి జోష్ తో కనిపించారు. ఈ మూవీ తరువాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడిగిన సందర్భంగాలో ఆసక్తికరంగా ఓ ప్రాజెక్ట్ గురించి చెప్పారు.
అదే 'గరుడ'. 'బాహుబలి 2' తరువాత నేను చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ 'గరుడ' అని దీనికి సంబంధించిన ఓ ఐడినా నా మైండ్ లో రన్నవుతోందని, దీన్ని త్వరలోనే మెటీరియలైజ్ చేస్తానని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పడే ఇంతకు మించి చెప్పలేనని కూడా స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చేయబోతున్నానని స్పష్టం చేశారు. కానీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దాని గురించి జక్కన్న అసలు మాట్లాడటమే లేదు.
ఆ స్థానంలో 'ట్రిపుల్ ఆర్' ని పట్టాలెక్కించారు. ఎన్టీఆర్ తో సోలో సినిమాగా 'గరుడ'ని తెరపైకి తీసుకొస్తానని చెప్పిన రాజమౌళి దాన్ని పక్కన పెట్టేసి మల్టీస్టారర్ మూవీ 'ట్రిపుల్ ఆర్'ని పట్టాలెక్కించడం, ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ పాత్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో జక్కన్నపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరో సారి వార్ ప్రకటించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
ఎన్టీఆర్ తో సోలోగా 'గరుడ' ప్రాజెక్ట్ ని మహేష్ మూవీ తరువాతైనా జక్కన్న చేస్తారా? లేక మళ్లీ ఏవో కారణాలు చెప్పి తప్పించుకుంటారా? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇంతకీ 'గరుడ' ప్రాజెక్ట్ ఏమైందన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.