ఒకపక్క అన్నయ్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగుతో పాటు కేరళలోనూ బలమైన ఇమేజ్ తో మార్కెట్ తో దూసుకుపోతున్నాడు. ఇటు చూస్తే అతని తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ కు సక్సెస్ అందని ద్రాక్షగా నిలిచిపోతోంది. స్ట్రెయిట్ సబ్జెక్టు చేసినా రీమేక్ అందుకున్నా ఫలితం ఒకేలా ఉంటోంది. మొన్న వచ్చిన ఎబిసిడి మలయాళం రీమేక్ కాబట్టి సేఫ్ అవుతుంది అనుకుంటే ఫలితం మారలేదు. ఇప్పుడు శిరీష్ కొత్త సినిమా ఏది అనే అప్ డేట్ గీత కాంపౌండ్ నుంచే కాదు ఏ సోర్స్ నుంచి రావడం లేదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం కొత్త కథలేవి తన దగ్గరకు రావడం లేదట. నిర్మాతలు సైతం ఇప్పుడున్న పరిస్థితుల్లో శిరీష్ తో సినిమా అంటే ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అనే దాని మీద ఆలోచన చేస్తూ కలిసేందుకు కాలయాపన చేస్తున్నారని సమాచారం. తాను నటించే సినిమా వ్యవహారాల్లో శిరీష్ ఎక్కువ జోక్యం చేసుకుంటాడనే కామెంట్ కూడా ఉంది కానీ దాన్ని తనే చాలా సార్లు ఖండించాడు కూడా.
ఇప్పటిదాకా శిరీష్ కున్న చెప్పుకోదగ్గ హిట్టు శ్రీరస్తు శుభమస్తు ఒక్కటే. ఆ తరహాలో తనకు సూటయ్యే కథల కోసం శిరీష్ వెయిట్ చేస్తున్నాడని సన్నిహితుల మాట. మరో వర్గం మాత్రం నాన్న అల్లు అరవింద్ కు నిర్మాణ వ్యవహారాల్లో తోడుగా ఉంటే గీత ఆర్ట్స్ ని ఇంకో లెవెల్ కు తీసుకెళ్లవచ్చనే కోణంలో సలహాలు ఇస్తున్నారట. శిరీష్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఒకవేళ నటనే కొనసాగించాలి అనుకుంటే హిట్టో ఫట్టో వరుసగా సినిమాలు చేసుకుంటూ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఉంటే సక్సెస్ పలకరించకపోదు. ఈ మధ్య మీడియాకు సైతం శిరీష్ చిక్కడం లేదు ఎందుకో మరి