మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ధమాకా'. త్రినాథరావు నక్కిన ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. టీజర్, ట్రైలర్ తో భారీ బజ్ ని క్రియేట్ చేసిన ఈ యాక్షన్ డ్రామా ఈ ఇయర్ ఎండింగ్ లో డిసెంబర్ 23న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ని స్పీడప్ చేసేశారు.
ఇప్పటికే లిరికల్ వీడియోలతో ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసిన చిత్ర బృందం ఆరు లిరికల్ వీడియోలని విడుదల చేసింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. సినిమాలోని ఆరు పాటల్లో 'జింతాక జింతాక' సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతూ 40 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఈ పాటతో 'ధమాకా' నెట్టింట ట్రెండ్ అవుతూ భారీ బజ్ ని క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది.
ఇదిలా వుంటే రీసెంట్ గా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో 'మనకి కావాల్సిన వాళ్లకు చేస్తే మోసం.. మనకి కావాలి అనుకున్న వాళ్ల కోసం చేస్తే న్యాయం' అంటూ ఓ డైలాగ్ వుంది. ఈ డైలాగ్ కు హీరో రవితేజ 'త్రివిక్రమ్ మీకు చుట్టమా సార్' అంటూ కౌంటర్ వేయడం తెలిసిందే. ఈ క్లిప్ వల్ల 'ధమాకా' ట్రైలర్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ గా మారి ట్రెండ్ అవుతోంది. ప్రాసలు పంచ్ లతో త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ ల జాబితాలో చేరిపోయిన విషయం తెలిసిందే. ఆయన డైలాగ్ లు రాసే విధానం వల్లే ఆయనని ప్రస్తుత స్థాయిలో నిలబెట్టింది.
దీంతో త్రివిక్రమ్ ప్రాసల్ని, పంచ్ లని ఇతర డైరెక్టర్లు కూడా ఫాలో కావడం మొదలు పెట్టారు, తాజాగా 'ధమాకా'లో త్రివిక్రమ్ ప్రాసల్ని, పంచ్ లని వాడిన విధానం, దానికి రవితేజతో పంచ్ వేయించిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ డైలాగ్ లు విన్న వాళ్లు గరూజీని ఓ రేంజ్ లో వాడేశారుగా అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ పంచ్ డైలాగ్ పై దర్శకుడు త్రినాథరావు నక్కిన వివరణ ఇచ్చాడు. త్రివిక్రమ్ గొప్పదనాన్ని చెప్పడం కోసమే ఆ డైలాగ్ వాడాం తప్ప ఆయనని కించపరచాలని కాదని, ఈ డైలాగ్ ని త్రివిక్రమ్ కూడా బాగా ఎంజాయ్ చేశారన్నాడు.
అంతే కాకుండా ఇది సినిమాలో కావాలని ఇరికించిన డైలాగ్ కాదని, సినిమాలో వున్న హీరో క్యారెక్టర్ ని ఉద్దేశించే అలా డైలాగ్ లలో ప్రాసలు, పంచ్ లు వుండేలా చూసుకున్నామన్నాడు. ఇక ఈ డైలాగ్ గురించి తెలిసి ఫోన్ చేసి త్రివిక్రమ్ చాలా సరదాగా మాట్లాడారని చెప్పుకొచ్చాడు. అంటే గురూజీ 'ధమాకా' పంచ్ డైలాగ్ విషయంలో హ్యాపీగానే వున్నారన్నమాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.