ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కాంతారా సినిమా హాట్ టాపిక్ గా మారిపోయింది. మొదట కన్నడ ఇండస్ట్రీలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా అక్కడ 75 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబెల్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేస్తోంది.
ఇక సెప్టెంబర్ 30వ తేదీన కన్నడలో విడుదల కాగా గత వారం తెలుగులో అలాగే హిందీలో కూడా విడుదల అయింది. ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే కేజిఎఫ్ నిర్మాతలు ఈ.కాంతార సినిమాను మళ్ళీ హైలెట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ పై రోజుకో టాక్ వైరల్ అవుతుంది. ఇప్పటికే 90 కోట్లు దాటినట్లు 100 కోట్లకు చేరువలో ఉన్నట్లు కూడా చెబుతున్నారు
ఇక ఈ సినిమాను చూసినవారు చాలావరకు అయితే తప్పకుండా 60 నుంచి 70 కోట్ల మధ్యలో సినిమా కోసం ఖర్చు చేసి ఉంటారు అని అనుకుంటున్నారు. కానీ నిజంగా ఈ సినిమా బడ్జెట్ ఆ రేంజ్ లో అయితే కాలేదట. మొదట అయితే కేవలం 10 కోట్లలోపే ఈ సినిమాను పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కంటెంట్ చాలా బలంగా ఉంది కాబట్టి కాస్త ఎక్కువ అయినా పర్వాలేదు అని దర్శకుడు హీరో రిషబ్ శెట్టికి భరోసా ఇచ్చారు.
దీంతో అతను హీరో గానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చాలా చక్కగా నిర్వర్తించాడు. ఇక ఈ సినిమా బడ్జెట్ మొత్తంగా 18 కోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది. ఇక పెట్టిన పెట్టుబడికి అయితే బయర్లు అందరూ కూడా ప్రాఫిట్ లోనే ఉన్నారు.
తెలుగులో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది. ఇక హిందీలో కూడా సినిమా 10 కోట్ల టార్గెట్ కు చేరువలో ఉంది. ఏదేమైనా కూడా ఈజీగా 100 కోట్లకు దాటేస్తుందని కూడా అంటున్నారు. మరి మొత్తంగా నిర్మాతలు కు ఎంత ప్రాఫిట్ వస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.