ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట. అయితే.. 2019లో వైసీపీ ఇక్కడ చాలా నియో జకవర్గాల్లో పాగా వేసింది. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తరచుగా ..చంద్రబాబు పర్యటిస్తుండడం.. వైసీపీలో రగడలు.. అధినేతపైనే విమర్శలు చేస్తున్న నాయకగణంతో వైసీపీ ఒకవైపు.. కునారిల్లి పోతుండగా.. మరోవైపు.. టీడీపీలో పెరుగుతున్న చేరికలు.. పార్టీని బలోపేతం చేయడంతోపాటు.. భవిష్య త్తుపై ఆశలను సజీవం చేస్తున్నాయి.
జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానం ఉండగా, అందులో రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌లలో టీడీపీ గెలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే చర్చ జరుగుతోంది. మరోవైపు.. చంద్రబాబు తరచుగా ఇక్కడ పర్యటనలు చేస్తుండడంతో టీడీపీ కేడర్ చాలా ఉత్సాహంగా ఉంది. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా స్వచ్ఛందంగా నాయకులు తరలివస్తున్నారు.
అయితే.. జిల్లాలో కొన్ని చోట్ల నేతల వైఖరి కేడర్‌కు ఇబ్బందికరంగా ఉంది. గత ఎన్నికల తర్వాత పార్టీని కొందరు నాయకులు పట్టించుకోకపోవడం గమనార్హం. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన కొందరు నేతలు తర్వాత పార్టీ పరిస్థితి గురించి గానీ, కేడర్‌కు అండగా ఉండాలని కూడా ఆలోచించకపోవడం గమనార్హం. రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో పోటీ చేసిన మాగంటి రూప, ఎన్నికల తర్వాత పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
కొన్ని పరామర్శలకు వచ్చి వెళతారంతే. పార్టీ అధిష్ఠానం కూడా ఇక్కడ లోక్‌సభ స్థానానికి ఇన్‌చార్జిగా ఎవరినీ నియమించలేదు. పార్లమెంటరీ పార్టీ స్థాయిలోనే కొత్త జిల్లాలు ఉండడం వల్ల జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను నియమించారు. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి లో కొన్ని కమిటీలు కూడా నియమించారు. కానీ ఇప్పటి వరకూ కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జిలను నియమించలేదు.
నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు గత ఎన్నికల తర్వాత పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇటీవల చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం ఆయనను కలిశారు. మండల స్థాయి కమిటీలు కూడా పాతవే.
వారిలో కొందరు హుషారుగా ఉండి మండల స్థాయిలో బాదుడేబాదుడు వంటి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ పుంజుకోవడం ఖాయమేనని.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పార్టీ పరుగులు పెట్టడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.