సమంత లీడ్ రోల్ లో వస్తున్న యశోద సినిమా నవంబర్ 11న రిలీజ్ ఫిక్స్ చేశారు. హరి-హరీష్ దర్శక ద్వయం డైరెక్ట్ చేసిన ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటన్నది ఇటీవల రిలీజైన టీజర్ చూస్తే అర్ధమైంది. సరోగసీ బ్యాక్ డ్రాప్ లో యశోద సినిమా వస్తుంది. సినిమాలో సమంత యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసింది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ యశోద స్పెషల్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా ప్రమోషన్స్ కి సమంత దూరమవడమే చిత్రయూనిట్ ని డైలమాలో పడేసింది.
సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుంది. రీసెంట్ గానే తనకు వచ్చిన ఈ వ్యాధి గురించి చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది సమంత. ఎలా లేదన్నా రెండు మూడు నెలలు సమంత ట్రీట్ మెంట్ కి టైం పడుతుంది. తను పూర్తిగా కోలుకోవాలంటే కనీసం ఆరు నెలలైనా పడుతుందని అంటున్నారు. మరి ఇలాంటి టైం లో సినిమా రిలీజ్ చేయడం పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. అయితే సమంత రాకుండానే యశోద ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలుస్తుంది.
ఈమధ్య సినిమాలకు ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తేనే సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్తుంది. అలాంటిది మెయిన్ లీడ్ లేకుండా ప్రమోషన్స్ అంటే చాలా కష్టమని చెప్పొచ్చు. సమంత వచ్చి ప్రమోషన్స్ చేస్తేనే యశోద సినిమా గురించి కాస్త కూస్తో ఆడియన్స్ ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది జరిగే ఛాన్స్ లేదు అందుకే యశోద పరిస్థితి ఏంటని సమంత ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అదీగాక యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేశారు. మరి నేషనల్ వైడ్ రిలీజ్ అంటే సినిమాని ఎంత ప్రమోట్ చేయాలో అందరికి తెలిసిందే.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ యశోద సినిమా నిర్మించారు. సినిమాకు బిజినెస్ కూడా భారీగానే జరిగిందని తెలుస్తుంది. సినిమా ప్రమోషన్స్ లేకుండా సమంత హిట్ కొడుతుందా లేదా అన్నది చూడాలి. సమంత ఇదివరకు చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ యూటర్న్, ఓ బేబీ సినిమాలు సక్సెస్ అయ్యాయి.
ఇక ఇప్పుడు యశోద ఆ హిట్ మేనియా కొనసాగుతుందా అన్నది చూడాలి. యశోద తో పాటుగా సమంత శాకుంతలం సినిమా కూడా పూర్తి చేసింది. గుణ శేఖర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా డిసైడ్ చేయలేదు కనీసన్ శాకుంతలం రిలీజ్ టైం లో అయినా సమంత అందుబాటులో ఉండాలని ఫ్యాన్స్ కోరుతున్నార
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.