అసలు సమంత ఏం చెప్పాలని అనుకుంటోంది..?

Update: 2022-10-12 07:30 GMT
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన మాజీ భార్య నుంచి విడిపోయి సరిగ్గా ఏడాది దాటిపోయింది. అక్కినేని నాగచైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్న సామ్.. నాలుగేళ్లు తిరక్కుండానే గతేడాది అక్టోబర్ లో వైవాహిక బంధాన్ని బ్రేక్ చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె వ్యక్తి జీవితం గురించి నిత్యం ఏదొక వార్త వస్తూనే ఉంది. అయితే లేటెస్టుగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

విడాకుల ప్రకటన తర్వాత కొన్ని రోజులు విహార యాత్రలకు వెళ్లొచ్చిన సమంత.. వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తూ బిజీగా మారిపోయింది. ఎప్పటిలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ వచ్చింది. అమ్మ చెప్పింది పేరుతో కొన్ని కొటేషన్లు సందేశాలు షేర్ చేస్తూ వచ్చింది. కాకపోతే ఇవన్నీ కూడా నిగూఢ అర్థం వచ్చేలా.. ఎవరినో పరోక్షంగా టార్గెట్ చేస్తున్నట్లుగా నెటిజన్లు భావించారు.

అయితే సమంత దాదాపు నాలుగు నెలలుగా సైలెంట్ అయిపోయింది. సినిమా షూటింగ్స్ లో పాల్గొనకపోవడమే కాదు.. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ - ట్విట్టర్ లలో పోస్టులు పెట్టకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సామ్ కు ఏమైందో అని అభిమానులు ఆరాలు తీశారు. ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు వచ్చాయని రూమర్స్ వచ్చాయి.

ఇలా ఎన్ని పుకార్లు వచ్చినా అగ్ర నటి మాత్రం దేని గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. అయితే ఉన్నట్టుండి సమంత ఇటీవల ఓ ఆసక్తికరమైన పోస్టుతో సోషల్ మీడియాకు తిరిగి వచ్చింది. తన పెట్ డాగ్ ఫొటోను షేర్ చేస్తూ 'డౌన్.. నాట్ అవుట్' అనే క్యాప్షన్ పెట్టింది. ఇది నెట్టింట వైరల్ అయింది.

లేటెస్టుగా సమంత మరో ఫోటోను క్యాప్షన్‌ తో షేర్ చేసింది. తన ఫేస్ కనిపించకుండా టీ-షర్టు మాత్రమే కనిపించే ఫొటోని షేర్ చేస్తూ.. ''ఒకవేళ మీరు దీన్ని కూడా వినవలసి వస్తే.. మీరు ఎప్పటికీ ఒంటరిగా నడవరు" అని పోస్ట్ చేసింది. దీనికి రెడ్ హార్ట్ ఎమోజీని జోడించింది.

ఇక్కడ సామ్ ధరించిన టీ షర్ట్‌ పై కూడా 'మీరు ఎప్పటికీ ఒంటరిగా నడవరు' అనే క్యాప్షన్ ముద్రించబడి ఉండటాన్ని గమనించవచ్చు. ఇది సాధారణ సోషల్ మీడియా పోస్టులాగా ఉన్నప్పటికీ.. ఇందులో నిగూఢ అర్థం ఉండొచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ రహస్య సందేశాలతో సమంత ఏం చెప్పడానికి ప్రయత్నిస్తోంది? అని ఆలోచిస్తున్నారు.

వెనక్కి తగ్గా.. కానీ ఓడిపోలేదు అని అర్థం వచ్చేలా సామ్ పెట్టిన మొదటి పోస్ట్ ని బట్టి.. ఆమె తన అనారోగ్యం నుంచి కోలుకున్నానని.. బలంగా తిరిగి వస్తానని చెబుతోందా? అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రెండో పోస్టుకి అర్థం ఏమిటి? అనే దానిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

'మీరు ఎప్పటికీ ఒంటరిగా నడవలేరు' అనే క్యాప్షన్ కి సామ్ ప్రేమకు చిహ్నమైన రెడ్ హార్ట్ ఎమోజిని జోడించినందున.. ఆమె మళ్లీ ఎవరితోనైనా ప్రేమలో పడిందని అనుకోవాలా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సమంత గతంలోనూ అనేక సందర్భాల్లో చాలా తెలివిగా పరోక్ష అర్థం వచ్చేలా పోస్టులు పెట్టింది. అందుకే ఇప్పుడు ఈ రహస్య సందేశాలు కేవలం అందరి దృష్టిని ఆకర్షించే పోస్టులేనా? లేదా దీని వెనుక ఇంకేమైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

ఇక సమంత వర్క్ విషయానికొస్తే.. తను నటించిన 'యశోద' సినిమాకు రెండు రోజుల నుంచి డబ్బింగ్ చెబుతోందని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.





నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News