లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో మామూలు పరిస్థితులు వచ్చాయని ఆనంద పడే లోపు మళ్ళీ కరోనా వార్తలు కలవరపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎప్పటిలాగే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేశారు. కర్ణాటక మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఇప్పటికే 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతులు ఇచ్చారు. దీంతో ఇప్పటికే పలు ఇండస్ట్రీలలో సినిమాలు వాయిదా వేసుకున్నారు. అయితే టాలీవుడ్ లో మాత్రం ఇంతవరకు సినిమాలు పోస్ట్ పోన్ చేయడం గురించి ఎలాంటి ప్రకటనలు లేవు.
నిజానికి జనవరి నుంచి థియేటర్స్ రీ ఓపెన్ అయినా, ఈ ఏప్రిల్ నుంచే టాలీవుడ్ లో క్రేజీ మూవీస్ విడుదలలు ఉన్నాయి. రేపు 'వకీల్ సాబ్' సినిమా రిలీజ్ అవుతోంది. ఇదే నెలలో 'లవ్ స్టోరీ' 'టక్ జగదీష్' సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో 'ఆచార్య' 'నారప్ప' 'బీబీ3' 'కేజీఎఫ్ 2' 'రాధేశ్యామ్' 'పుష్ప' 'ఆర్.ఆర్.ఆర్' వంటి భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ చేసి పెట్టుకున్నారు. వీటితో పాటు చిన్నా చితక మీడియం రేంజ్ సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే 'వకీల్ సాబ్' కు ఇబ్బందేమీ లేదు. అనుకున్న సమయానికి రావడమే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో వంద శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శించబడనుంది.
అయితే రాబోయే సినిమాల రిలీజుల విషయంలోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమాలు పోస్ట్ ఫోన్ అవుతాయని.. సీటింగ్ ఆక్యుపెన్సీ 100 శాతం నుంచి మళ్ళీ 50 శాతానికి తగ్గిస్తారని టాక్ నడుస్తోంది. అదే సమయంలో కంప్లీట్ గా థియేటర్స్ క్లోజ్ చేయకుండా ఆక్యుపెన్సీ తగ్గిస్తే ఇబ్బందేమీ ఉండదని.. సంక్రాంతికి 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదలై బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాలను గుర్తు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.