యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ 'ట్రిపుల్ ఆర్'. దర్శకధీరుడు జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లని రాబడుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రికార్డుల్ని సమం చేసిన ట్రిపుల్ ఆర్ తాజాగా బాహుబలి ఆల్ టైమ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి ఫస్ట్ ప్లేస్ కి చేరింది. ఇక బాలీవుడ్ లోనే ఇదే హవాని కొనసాగిస్తూ ఉత్తరాదిలోనూ ఈ మూవీ హిందీ వెర్షన్ త్వరలో 200 కోట్ల క్లబ్ లో చేరబోతోంది.
ఇదిలా వుంటే ఈ మూవీతో కొమరం భీం గా అలరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అయిపోతున్నాడు. ట్రిపుల్ ఆర్ తరువాత ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇది ఎన్టీఆర్ నటించనున్న 30 వ చిత్రం. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ మూవీని నందమూరి కల్యాణ్ రామ్, సుధాకర్ మిక్కినేని అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఓ పక్క ట్రిపుల్ ఆర్ కారణంగా ఎన్టీఆర్ బిజీగా వుండటం, 'ఆచార్య' కారణంగా దర్శకుడు కొరటాల శివ బిజీగా వుండటం వల్ల ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ట్రిపుల్ ఆర్ రిలీజ్ కావడం.. 'ఆచార్య' ఏప్రిల్ లో రిలీజ్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ - కొరటాల మూవీ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని మాత్రం జూన్ నేంచే ప్రారంభించబోతున్నారట.
అంతే కాకుండా ఈ మూవీ కోసం ఎన్టీఆర్ దాదాపుగా 6 నుంచి 8 కిలోల వరకు బరువు తగ్గబోతున్నారని, కొరటాల మూవీలో సరికొత్త మేకోవర్ లో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నారట.
దాదాపు మూడున్నరేళ్లుగా ట్రిపుల్ ఆర్ కోసం రాత్రింబవళ్లు శ్రమించిన ఎన్టీఆర్ ఈ మూవీ రిలీజ్ కావడంతో ఫ్యామిలీతో కలిసి రెండు నెలల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోబోతున్నారట.
ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్. ట్రిపుల్ ఆర్ కోసం కొంత బరువు పెరిగిన ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కోసం బరువు తగ్గి సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నారట. ఇందు కోసం ప్రత్యేకంగా కసరత్తులు మొదలు పెట్టిన ఎన్టీఆర్ రెండు నెలల తరువాతే ఈ మూవీకి టైమ్ కేటాయించడంతో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని జూన్ నుంచి ప్రారంభించబోతున్నారు.