ఆ వంద కోట్లు ఎక్క‌డ‌?

Update: 2021-12-31 16:30 GMT
`బాహుబ‌లి` త‌రువాత మ‌న తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయిన విష‌యం తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్టుగానే మ‌న వాళ్ల సినిమాల‌కు దేశ వ్యాప్తంగా బిజినెస్ జరుగుతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే మ‌న స్టార్ హీరోల సినిమాల బ‌డ్జెట్ లు కూడా భారీగా పెరిగిపోయిన విష‌యం తెలిసిందే. బ‌డ్జెట్ పెర‌గ‌డం.. బిజినెస్ పెర‌గ‌డంతో మ‌న వాళ్లు త‌మ రెమ్యున‌రేష‌న్ లు కూడా భారీగా పెంచేస్తున్నారు. ఒక్కో స్టార్ హీరో ఒక్కో చిత్రానికి 30 నుంచి 50 కోట్ల వ‌ర‌కు పారితోషికం కింద డిమాండ్ చేస్తున్నారంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌భాస్ నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌హేష్ బాబు, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ .. ఇలా ప్ర‌తీ హీరో డిమాండ్ ని బ‌ట్టి 30 నుంచి 50 కోట్లు.. లేదంటే అంత‌కు మించి వంద కోట్ల వ‌ర‌కు తీసుకుంటున్నార‌ని తాజాగా ప్ర‌చారం మొద‌లైంది. అయితే ఈ ప్ర‌చారంపై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సెటైర్ వేశారు. ఎక్క‌డ వంద కోట్లు...? ఎవ‌రిస్తున్నారో కొంచెం చెప్పండి అంటూ రివ‌ర్స్ పంచ్ వేశారు. ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన చిత్ర‌మిది. సినిమాపై వున్న గ‌ట్టి న‌మ్మ‌కంతో రాజ‌మౌళి కేవ‌లం పబ్లిసిటీకే 20 కోట్లు కేటాయించి భారీ స్థాయిలో ఈ సినిమాని ప్ర‌మోట్ చేస్తుండ‌టంతో ప్రారంభ వ‌సూళ్లు చ‌రిత్ర స‌ష్టించ‌డం ఖాయం అని తెలుస్తోంది. ఈ చిత్రానికి పారితోషికంగా దర్శ‌కుడు రాజ‌మౌళి లాభాల్లో 30 శాతం వాటా.. హీరోలు రామ్ చ‌ర‌ణ్ , ఎన్టీఆర్ 25 కోట్లు తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అంతే కాకుండా త‌న త‌దుప‌రి సినిమాలకు హీరో రామ్ చ‌ర‌ణ్ ఏకంగా 100 కోట్లు డిమాండ్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ ప్ర‌చారంపై ఓ మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు రామ్ చ‌ర‌ణ్ అదిరిపోయే స‌మాధానం చెప్ప‌డ‌మే కాకుండా ఎదురు ప్ర‌శ్నించారు. ఎక్క‌డ ఆ వంద కోట్లు.. ఇంత‌కీ ఎవ‌రిస్తున్నారు? .. ఎవ‌రిచ్చారు? త‌ను వంద కోట్లు డిమాండ్ చేశాన‌న్న‌ది పెద్ద జోక్ అంటూ చెప్పుకొచ్చారు. చ‌ర‌ణ్ చెప్పిన స‌మాధానం ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News