రాయ్ లక్ష్మి.. మధునందన్.. ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి'. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది. దాదాపు రెండు నిముషాల నిడివి ఉన్న ట్రైలర్లో సినిమా జోనర్ ను రివీల్ చేశాడు దర్శకుడు. ఇప్పటివరకూ వచ్చిన ప్రోమోలలో ఇది రొమాంటిక్ కామెడి అనిపించింది కానీ నిజానికి ఇది ఓ హారర్ కామెడీ.
ట్రైలర్ మొదట్లో ఒక ప్రేమ జంటను వారి లిప్పులాకులను చూపించారు. ఆ తర్వాత మధునందన్.. ప్రవీణ్ ఇద్దరూ రాయ్ లక్ష్మి అందానికి ముగ్ధులైపోయి వెనకాల తిరుగుతూ ఉంటారు.. ఒకానొక భయానకమైన క్షణంలో వెంకటలక్ష్మి దెయ్యం అవతారంలో కనిపించేవరకూ ఈ అల్లరి కొనసాగుతుంది. ఆ తర్వాత ఇంకేముంది.. ఇద్దరికీ జింతాత జిత జిత. మొదట చూపించిన ప్రేమ జంటకు వెంకట లక్ష్మికి ఏంటి సంబంధం? ఆమె మధునందన్.. ప్రవీణ్ లతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తుందనేది సినిమా చూస్తే గానీ తెలిసేలా లేదు. కానీ కొన్ని షాట్స్ లో బ్రహ్మాజీ ని చంపడం.. రాయ్ లక్ష్మి గాయాలతో ఉండడం లాంటివి చూపించారు కాబట్టి ఆమె దెయ్యంగా మారడానికి గట్టి కారణమే ఉండాలి. ఒక షాట్ లో ప్రవీణ్.. మధు ఇద్దరూ బెల్లంపల్లి హిందూ స్మశాన వాటిక కు వెళ్లి "వెంకటలక్షిమే" అంటూ భయంతో కూడిన ప్రేమతో పిలుస్తారు. అప్పుడు ఆకాశం నుండి సడెన్ గా డౌన్ లోడ్ అయి గాలిలో వేలాడుతుంది సదరు వెంకటలక్ష్మి! ఇలా ఉంది మన టాలీవుడ్ రత్తాలు వ్యవహారం.
ఇక ఇద్దరు కమెడియన్లు ఉన్నారు కాబట్టి పంచులకు కొదవేమీ లేదు. ప్రవీణ్ ఒక చోట తడికపైనుండి తొంగి చూస్తూ "సత్యవతా.. స్నానం చేస్తున్నావా?" అని తనదైన స్టైల్ లో అడుగుతాడు. ఇలాంటి ప్రశ్నకు 'ఛీ పోరా' అని కోపంతో కూడిన చిరాకు సమాధానం వస్తుంది. మరో సీన్లో రాయ్ లక్ష్మీ ఇద్దరి పేర్లను అడుగుతుంది.. చంటిగాడు అని ప్రవీణ్.. పండుగాడు అని మధునందన్ అర సెకండ్ గ్యాప్ లేకుండా చెప్పేస్తారు. ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఈ వ్యవహారం.. ఆలస్యం ఎందుకు.. మీరూ చూడండి.
Full View