రౌడీగారి సినిమానుంచి మధ్యలోనే లేచి వెళ్లిపోయాడట!

Update: 2019-07-24 08:42 GMT
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్' మరో రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  దీంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.  'డియర్ కామ్రేడ్' హీరో హీరోయిన్లు విజయ్ రష్మిక మ్యూజిక్ ఫెస్టివల్స్ లో పాల్గొనడంతో పాటుగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ ను మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు.  తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయ్ విమర్శల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

క్రిటిసిజం గురించి మాట్లాడుతూ నిర్మాణత్మకమైన విమర్శలైతే స్వీకరిస్తానని.. పిచ్చి విమర్శలైతే తనకు నచ్చదని తెలిపాడు.  అలా అని విమర్శకులను 'ఆర్జున్ రెడ్డి' స్టైల్ లో తిట్టలేదు.  తన సినిమాలపై ప్రతి ఒక్కరికీ ఒకే అభిప్రాయం ఉండాలని రూలేమీ లేదని అన్నాడు.  తమ్ముడు ఆనంద్ అమెరికాలో ఉద్యోగం చేసే సమయంలో తన సినిమా ప్రీమియర్ కు వెళ్ళాడని.. ఆ సినిమా నుండి మధ్యలో లేచి వెళ్లిపోయాడని చెప్పాడు.  "ఆ సినిమా సగం చూడడమే నావల్ల కాలేదు" అంటూ ఆనంద్ తన రౌడీ అన్నయ్యకు ఫీడ్ బ్యాక్ ఇచ్చాడట.  మరి ఆనంద్ ను అంత మానసిక వేదనకు గురి చేసిన ఆ సినిమా ఏదో మరి!

విజయ్ సినిమాల్లో ఫ్లాప్ అయినవి.. 'ద్వారక'.. 'ఏ మంత్రం వేసావే'.. 'నోటా'.  ఆనంద్ అమెరికాలో ఉన్న సమయంలో రిలీజ్ అయిన సినిమాలు అంటే మొదటి రెండే.  అందులో 'ఏ మంత్రం వేసావే' ను బ్యాక్ లాగ్ అంటూ కర్వేపాకును తీసి పడేసినట్టు రౌడీగారు పక్కన పడేసిన సంగతి తెలిసిందే. మరి ఆనంద్ ను ఇబ్బంది పెట్టిన సినిమా 'ద్వారక' అయి ఉండొచ్చు!

    

Tags:    

Similar News