మాస్టర్‌ నెక్ట్స్‌ కోసం ఆ ముగ్గురు ముద్దుగుమ్మల్లో ఒక్కరు

Update: 2021-02-06 14:30 GMT
తమిళ సూపర్‌ స్టార్ విజయ్‌ హీరోగా రూపొందిన మాస్టర్‌ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్‌ సినిమాకు యావరేజ్ టాక్‌ వచ్చింది. అయినా కూడా భారీ వసూళ్లను దక్కించుకుంది. తమిళనాడుతో పాటు కేరళ మరియు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. సినిమా యావరేజ్ గా ఉన్నా.. థియేటర్ల ఆక్యుపెన్సీ 50 శాతం అయినా కూడా ఈ రేంజ్‌ లో వసూళ్లు దక్కించుకున్న నేపథ్యంలో విజయ్‌ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. విజయ్ మాస్టర్‌ తర్వాత చేయబోతున్న సినిమా ఏంటీ అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక విజయ్‌ కు జోడీగా తదుపరి సినిమాలో నటించబోతున్న ముద్దుగుమ్మ ఎవరు అనే చర్చ జరుగుతోంది. విజయ్‌ తదుపరి సినిమా కోసం ముగ్గురు ముద్దుగుమ్మలు పరిశీలనకు ఉన్నారట.

విజయ్ తదుపరి సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం ముగింపు దశకు వచ్చింది. ఆ సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే విజయ్‌ తో మూవీ చేయబోతున్నాడు. విజయ్‌ మూవీకి గాను దర్శకుడు నెల్సన్‌ దిలీప్ ముగ్గురు ముద్దుగుమ్మలను పరిశీలిస్తున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కియారా అద్వానీ.. రష్మిక మందన్నా.. పూజా హెగ్డేలు పరిశీలనలో ఉన్నారట. వీరు ముగ్గురు కూడా ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ డమ్‌ ఉన్న హీరోయిన్స్‌ అనే విషయం తెల్సిందే. అందుకే విజయ్‌ కి జోడీగా వీరిలో ఒకరిని ఎంపిక చేస్తే పాన్‌ ఇండియా క్రేజ్‌ ను ఈ సినిమాను జోడించే అవకాశం ఉందని దర్శకుడు భావిస్తున్నాడు. అందుకే ఆ ముగ్గురిలో ఒక్కరిని విజయ్‌ 65 కోసం ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు.


Tags:    

Similar News