వాళ్లు గాడిదలన్న నాగబాబు

Update: 2018-12-07 17:58 GMT
ఎంతో ఆసక్తి రేకెత్తించిన తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 67 శాతం పోలింగ్ నమోదైంది. కానీ రాజధాని హైదరాబాద్ లో మాత్రం పోలింగ్ శాతం 42 శాతం మాత్రమే. ఈసారి ఓటు విలువను చెబుతూ ఎన్నికల సంఘం.. ప్రభుత్వమే కాక సెలబ్రెటీలు కూడా ప్రచారం చేశారు. దీంతో ఓటర్లలో చైతన్యం వచ్చి ఉంటుందని.. ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశించారు. కానీ చదువుకున్న ఓటర్లే ఎక్కువగా ఉండే హైదరాబాద్ లో కేవలం 42 శాతమే పోలింగ్ నమోదవడం ఆశ్చర్యకరం. దీనిపై తీవ్ర విమర్శలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగర ఓటర్ సిగ్గుపడాలంటూ తీవ్ర వ్యాఖ్యే చేశాడు దర్శకుడు కొరటాల. ఇదే రీతిలో స్పందించాడు నటుడు నాగబాబు. ఓటు వేయని వాళ్లను ఆయన గాడిదలుగా అభివర్ణించాడు.

‘‘ఓటు మనకు సంక్రమించిన హక్కు. ఇది ఒక వజ్రాయుధం లాంటిది. మనకు నచ్చిన పార్టీని ఎన్నుకోవాలన్నా.. నచ్చని పార్టీని దింపేయాలన్నా ఓటు ద్వారానే సాధ్యం. దీన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరిపై ఉంది. ఒంట్లో బాగోలేకో.. కదల్లేని పరిస్థితుల్లోనో ఉన్నవాళ్లు తప్ప ఆరోగ్యంగా ఉండి కూడా ఈ రోజును ఒక సెలవు దినంగానో.. ఎంజాయ్మెంట్ డేగానో పరిగణించి ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేస్తే అలాంటి వాళ్లను అస్సలు క్షమించకూడదు. ఈ తరహా వ్యక్తులు గాడిదలతో సమానం ఒక అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు.. స్కాంలు చేసే నాయకుల కన్నా ఓటు వేయకుండా ఇంట్లో కూర్చునేవాడు చాలా దుర్మార్గుడు’’ అని నాగబాబు కుండబద్దలు కొట్టాడు.
Tags:    

Similar News