నీతులు చెప్పే వారు ఓటే వేయలేదు

Update: 2019-04-29 12:18 GMT
దేశంలోని పలు పార్లమెంటు నియోజక వర్గాలకు 4వ దశ ఎన్నికలు జరిగాయి. ఈ దశలో ముంబయిలో పరిధిలో ఉన్న పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ముంబయిలో పలువురు ఫిల్మ్‌ స్టార్స్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కొందరు బాలీవుడ్‌ స్టార్స్‌ మాత్రం పోలింగ్‌ బూత్‌ వద్ద కనిపించలేదు. కొందరికి ఇండియాలో అసలు ఓటే లేదు. ఇండియాలో స్టార్స్‌ గా వెలుగు వెలుగుతున్న పలువరు బాలీవుడ్‌ స్టార్స్‌ కు విదేశీ పౌరసత్వం ఉన్న కారణంగా ఇక్కడ ఓటే లేదు. వారిలో ముఖ్యుడు అక్షయ్‌ కుమార్‌. అవును బాలీవుడ్‌ స్టార్‌ హీరో అయిన అక్షయ్‌ కుమార్‌ తన సినిమాలతో సమాజంలో మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

పలు సందేశాత్మక చిత్రాలు చేసి, ఇతర హీరోలకు సైతం ఆదర్శంగా నిలిచిన అక్షయ్‌ కుమార్‌ నేడు ఓటు వేయలేక పోయాడు. కారణం అక్షయ్‌ కుమార్‌ కెనడా పాస్‌ పోర్ట్‌ తో ఇండియాలో ఉంటున్నాడు. ఆ కారణంగానే ఇండియాలో అక్షయ్‌ కి ఓటు హక్కు లేదు. అక్కడ పౌరసత్వం రద్దు చేసుకుని, ఇండియాలో అక్షయ్‌ కుమార్‌ శాస్వత పౌరసత్వం తీసుకోవచ్చు. కాని అక్షయ్‌ అలా మాత్రం చేయడం లేదు. ఇక బాలీవుడ్‌ కు చెందిన ఇంకా పలువురు స్టార్‌ అయిన కత్రీనా కైఫ్‌, ఆలియా భట్‌, సన్నీలియోన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ లు కూడా ఇండియాలో ఓటు హక్కును కలిగి లేరు.

హాట్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ ఇండియాలో యూకే వీసాతో ఉంటోంది. యూకే పౌరసత్వం ఉన్న కత్రీనా ఇండియాలో ఓటు హక్కు కలిగి లేదు. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం అయిన క్యూట్‌ బ్యూటీ ఆలియా భట్‌ కూడా ఇండియన్‌ పౌరసత్వంను కలిగి లేదు. ఆమెకు సంబంధీకులు అంతా కూడా ఇక్కడి వారే అయినా కూడా ఆమె మాత్రం యూకే సిటిజన్‌ గా కొనసాగుతోంది. ఇక విదేశీయులు అయిన సన్నీలియోన్‌ మరియు జాక్వెలన్‌ లు ఇండియాలో విపరీతంగా సంపాదిస్తున్నా కూడా ఇంకా ఇండియన్‌ పౌరసత్వం తీసుకోలేదు. వీరికి ఓటు హక్కు లేక వేయలేదు. మరి కొందరు స్టార్స్‌ ఓటు ఉన్నా కూడా వేసేందుకు ఆసక్తి చూపించకుండా, సినిమా షూటింగ్స్‌ అంటూ ఓటును వేసేందుకు ముందుకు రాలేదు.
Tags:    

Similar News