దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాని వార్తల్లో నిలిపిన చిత్రం `బాహుబలి`. ఈ మూవీ తరువాతే టాలీవుడ్ సినిమా అంటే వరల్డ్ వైడ్ గా క్రేజ్ తో పాటు మార్కెట్ స్థాయి కూడా పెరిగింది. మరీ ప్రధానంగా ఈ మూవీకి బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కమ్.. కరణ్ జోహార్ సపోర్ట్ గా నిలవడానికి, ఈ మూవీ ఉత్తరాదిలో సంచలన విజయం సాధించడానికి ప్రధాన కారకులు రానా. ఇది చాలా తక్కువ మందికే తెలుసు. అప్పటికే బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న రానా కారణంగానే కరణ్ జోహార్ `బాహుబలి`కి ఉత్తరాదిలో అండగా నిలిచి ఈ మూవీకి దేశ వ్యాప్తంగా క్రేజ్‌ని తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ఆ తరువాత కొన్ని చిత్రాలకు కూడా రానా అండగా నిలిచాడు. ఓ సినిమా ప్రచారం కోసం ఎప్పుడూ ముందుండే రానా ఇప్పడు మాత్రం తన సినిమాలకే కనిపించడం లేదు. కనీసం ట్వీట్ ల రూపంలో అయినా స్పందించడం లేదు. ఉన్నట్టుండీ ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారన్నది తెలియడం లేదు. రానా నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్దంగా వున్నాయి. వేణు ఊడుగుల దర్శకత్వంలో సురేష్ బాబుతో కలిసి సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం `విరాట పర్వం`.
90వ దశకంలో ఉత్తర తెలంగాణలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రారంభం నుంచి భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ గత ఏడాది ఏప్రిల్ 31న విడుదల చేస్తున్నామంటూ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి వార్త వినిపించడం లేదు. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోందని, చర్చలు జరుగుతున్నాయని వార్తలు వినిపించాయి.
ఆ వార్తలని రానా ఖండించలేదు. ఇక ఈ మూవీ తరువాత రానా .. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి `భీమ్లా నాయక్` చిత్రంలో నటించారు. ఈ మూవీ కూడా రిలీజ్ కి రెడీగా వుంది. ఏపీ రాజకీయాలు, టికెట్ రేట్లు ..థర్డ్ వేవ్ కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ ప్రచార చిత్రాల్లోనూ రానా పేరు వినిపించడం లేదు.
వీటిని పక్కన పెట్టి సైలెంట్ గా నెట్ ఫ్లిక్స్ కోసం బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి `రానా నాయుడు` వెబ్ సిరీస్ పనుల్లో బిజీగా గడిపేస్తున్నారు రానా. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. రానా, వెంకటేష్ ఇటీవలే ముంబై వెళ్లారు. షూటింగ్ లో పాల్గొంటున్నారు. రానా దీని గురించి తప్ప మరే సినిమా గురించి మాట్లాడటం లేదు. భీమ్లా నాయక్, విరాటపర్వం గురించి ఎక్కడా చెప్పడం లేదు. రీజన్ ఎంటీ? .. ప్రమోషన్స్ కి ముందుండే రానా ఇప్పుడు సడన్ గా ఎందుకు సైలెంట్ అయ్యాడు అన్నది ప్రతీ ఒక్కరినీ ఆలోచనలో పడేసింది.