ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలు కోలీవుడ్ లోనే అత్యంత వివాదాస్పదుడిగా పాపులరైన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ కి సమానమైన క్రేజ్ ని గౌరవాన్ని టాప్ కమెడియన్ హోదాలో దక్కించుకున్న అతడు రజనీ నివశించే పరిసరాల్లో భారీ భవంతులను కలిగి ఉన్నారని చెబుతారు. అయితే పలు సందర్భాల్లో రజనీతో వడివేలు విభేధాల గురించి కోలీవుడ్ మీడియాలో కథనాలు సంచలనమయ్యాయి. ఇక రకరకాల వివాదాల్లో వడివేలు పేరు మీడియాలో మార్మోగింది. ఇటీవల అతడు సినిమాల్లో నటించడం కూడా తగ్గించారు. ఒక రకంగా బహిష్కరణకు గురయ్యారు.
అయితే తాజా సమాచారం మేరకు నాలుగు సంవత్సరాల విరామం తర్వాత వడివేలు మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు. అతను చివరిగా 2017 విజయ్ నటించిన `మెర్సల్` చిత్రంలో కనిపించాడు. 2018 లో తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) అతడిని నిషేధించింది. దర్శకనిర్మాత శంకర్ .. దర్శకుడు చింబు దేవన్ వడివేలుతో సృజనాత్మక విభేదాలను పేర్కొంటూ కేసు దాఖలు చేశారు. అయితే అనంతర కాలంలో లైకా ప్రొడక్షన్స్ ఇటీవల సమస్యలో జోక్యం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేసింది. వడివేలు పునరాగమనం కోసం మార్గం సుగమం చేసింది. అదే బ్యానర్ సూరజ్ దర్శకత్వం వహించే చిత్రంలో వడివేలు ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా ఇప్పటికే మొదలైంది. పూజా కార్యక్రమాల అనంతరం మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా.. వడివేలు మాట్లాడుతూ.. తాను శంకర్‌తో కలిసి పని చేయనని `పులికేసి` ఫ్రాంచైజీలో తాను ఉండనని పేర్కొన్నాడు. శంకర్ తో ఘర్షణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారని దీనిని బట్టి అర్థమైంది. ప్రస్తుతం వడివేలు నటిస్తున్న తమిళ చిత్రం తలై నాగారం (2006) నుండి వడివేలు పాత్ర నాయీ శేఖర్ ఆధారంగా కొత్త కథతో రూపొందుతోంది. సూరజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
నీటి ట్యాంకర్ తో గుద్ది చంపేస్తా!
దర్శకుడు శంకర్ తోనే లొల్లిపెట్టుకుని పంచాయతీకి ఎక్కిన క్రమంలో వడివేలు కామెంట్ హీటెక్కించింది. ఇంసై అసరన్ 23 ఆమ్- పులకేసి-2 చిత్రాలకు సంబంధించిన వివాదం ఇప్పటికీ సద్దుమణగలేదు. షూటింగ్ లను మధ్యలోనే బ్రేక్ చేసి వెళ్లిపోవడంతో శంకర్ 4 కోట్లు డిమాండ్ చేసారు. ఇందులో వడివేలుదే తప్పు అన్నట్లు కోలీవుడ్ మీడియా సైతం ఎలివేట్ చేసే ప్రయత్నం చేసింది. అప్పట్లోనే వడివేలు మరో వివాదంలోనూ ఇరుక్కున్నారు.
మధురై- పుదూరుకు చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి పుదూర్ పోలీస్ స్టేషన్ లో వడివేలుపై ఫిర్యాదు చేసారు. సతీష్ పుదూర్ లోరియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన ఆఫీస్ లో గోవిందరాజు అనే వ్యక్తి నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. అయితే వడివేలు మేనేజర్ మణికంఠన్ అనే వ్యక్తి ఆ ఇద్దర్ని బెదిరించారనేది ఫిర్యాదు. గతంలో సతీష్ వడివేలుతో ఓ సినిమా చేసాడుట. దానికి సంబంధించిన డబ్బును వెంటనే సెటిల్ చేయకపోతే నీళ్ల లారీతో గుద్ది చంపేస్తానని మణికంఠన్ హెచ్చరించాడుట. ఇదంతా వడివేలు ప్రోద్భలంతోనే జరిగిందని సతీష్ పుదూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. పోలీసులు వడివేలు.. మణికంఠన్ పై కేసులు నమోదు చేసి విచారణకు సిద్ధమవ్వడం వేడెక్కించింది.
నడిగర సంఘంలో వివాదం!
తమిళ స్టార్ కమెడియన్ వడివేలు గతంలో కొలీగ్స్ పై నడిగరసంఘంలో ఫిర్యాదు చేయడం వేడెక్కించింది. తనపై అవమానకరంగా మాట్లాడిన ఆ ఇద్దరిపైనా వడివేలు సీరియస్ అయ్యారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సౌతిండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (నడిగరసంఘం)లో మొరపెట్టుకున్నారు. వడివేలు కొలీగ్ ఆర్టిస్ట్ కం నిర్మాత మనోబాలా.. నటుడు సింగముత్తులపై ఈ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనమైంది. మనోబాలాకు వేస్ట్ పేపర్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అక్కడ అతను ప్రముఖ మీడియా వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తాడు. అలాంటి ఒక ఇంటర్వ్యూలో నటుడు సింగముత్తు కనిపించారు. అక్కడ వారిద్దరూ రకరకాల సమస్యల గురించి మాట్లాడారు. ఇంటర్వ్యూలో మాట్లాడిన సింగముత్తు ప్రముఖ నటుడు వడివేలుతో తన సమస్య గురించి కామెంట్ చేసారు. ది వడివేలుకు ఏమాత్రం గిట్టలేదు. వడివేలు ఈ సమస్యను సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (నాడిగర్ సంగం) వద్దకు తీసుకెళ్ళి తన గురించి అవమానకరంగా మాట్లాడినందుకు ఫిర్యాదు చేశారు. మనోబాలా - సింగముత్తు కొన్ని సున్నితమైన విషయాల గురించి మాట్లాడినా వడివేలు ని హర్ట్ చేశారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి చాలా మంది నటులు ఉన్న వాట్సాప్ గ్రూపులో మనోబాలా ఇంటర్వ్యూను పంచుకున్నారని వడివేలు ఆరోపించారు. వడివేలు - సింగముతు అనేక సినిమాల్లో కలిసి నటించారు. ఆ ఇద్దరి కాంబినేషన్త తమిళ సినిమాల్లో ఎంతో పాపులర్. కొన్ని ఆస్తి గొడవల వల్ల వారు విడిపోయారు.