డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్- గోపికృష్ణ ఫిలింస్ సంస్థలు `రాధేశ్యామ్` చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్ దాదాపు 8ఏళ్ల తర్వాత పూర్తి ప్రేమకథా చిత్రంలో ప్రేమికుడి పాత్రను పోషిస్తున్నాడు. వర్షం లాంటి క్లాస్సీ ప్రేమకథలో నటించిన ప్రభాస్ కి రాధేశ్యామ్ లాంటి ప్రేమకథా చిత్రం ఒక గొప్ప అనుభూతుల సమాహారం. యూరప్ కనెక్టివిటీ ఉన్న రిచ్ బిజినెస్ మేన్ లవ్ స్టోరి తెరపై కొత్తగా ఆవిష్కృతం కానుంది.
ఈ మూవీ రిలీజ్ కి ముందు రకరకాల డైలమాలు ప్రస్తుతం ఆసక్తికర చర్చకు తావిచ్చాయి. ఇంతకాలం కరోనా వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. దీనికే ప్రభాస్ అభిమానులు చాలా చింతించారు. సాహో తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవాల్సొస్తుందని ఎవరూ అంచనా వేయలేదు. అందుకే రాధే శ్యామ్ రాక కోసం ఎంతో క్యూరియస్ గా వేచి చూస్తున్నారు.
అయితే ప్రభాస్ అభిమానుల ఒత్తిడి మేరకు ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయని తెలుస్తోంది. మరో ఆరు రోజుల పాటు పెండింగ్ చిత్రీకరణలు ముగించేసి తదుపరి వేగంగా నిర్మాణానంతర పనులు పూర్తి చేయాల్సి ఉందిట. ఏప్రిల్ నాటికి మొత్తం పూర్తి చేసి.. సుమారు మూడు నెలల పాటు వీఎఫ్ ఎక్స్ సహా వందశాతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది పీరియడ్ డ్రామా కాబట్టి ఈ చిత్రంలో చాలా విఎఫ్.ఎక్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ కే చాలా సమయం పడుతోంది.
ఇప్పటికే రిలీజైన పోస్టర్లకు అద్భుత స్పందన వచ్చింది. టీజర్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. ప్రభాస్ - పూజా మధ్య రొమాన్స్ పతాక స్థాయిలో వర్కవుటైందని అభిమానులు సంతోషంగా ఉన్నారు. జూలై 30 న తెలుగు- తమిళం- హిందీ- కన్నడ- మలయాళంలో ఏకకాలంలో విడుదల కానుంది.