లారెన్స్ ను బూతులు తిట్టి.. డెలీట్ చేసింది

Update: 2018-07-31 10:05 GMT
రెండు రోజులుగా అటు కోలీవుడ్లో.. ఇటు టాలీవుడ్లో రాఘవ లారెన్స్-శ్రీరెడ్డి గొడవ పెద్ద వార్తగా నిలుస్తోంది. కొన్ని రోజులుగా తమిళ సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి.. రాఘవ లారెన్స్ పేరు కూడా బయటపెట్టింది. అతను ఏడేళ్ల కిందట హైదరాబాద్ లో ‘రెబల్’ షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక హోటల్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. అవకాశాల పేరు చెప్పి తనను వాడుకున్నాడని ఆమె ఆరోపించింది. దీనిపై నిన్న లారెన్స్ గట్టిగానే రియాక్టయ్యాడు. శ్రీరెడ్డి ఆరోపణలన్నీ అవాస్తవమన్న లారెన్స్.. ఆమెపై తనకు సింపతీ ఉందని.. ప్రెస్ మీట్ కు వచ్చి మీడియా ముందు ఆమె యాక్టింగ్.. డ్యాన్సింగ్ టాలెంట్ చూపిస్తే ఆమెకు అవకాశం ఇస్తానని సవాలు విసిరాడు.

దీనికి శ్రీరెడ్డి స్పందిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఆమె దారుణమైన బూతులు వాడింది. లారెన్స్ ను అనరాని మాటలంది. లారెన్స్ భార్య ప్రస్తావన కూడా తెచ్చింది. ఈ వీడియోలో ఆమె మాటలు మరీ వల్గర్ గా ఉండటంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి బూతు తిట్టడం ఎంతటి సంచలమైందో తెలిసిందే. దానిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డికి హెచ్చరికలు అందినట్లున్నాయి. దీంతో కాసేపటికే ఆమె ఆ వల్గర్ వీడియోను డెలీట్ చేసేసింది. తర్వాత వేరే వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తన నట కౌశలాన్ని చూపించేప్రయత్నం చేసింది. అదొక డబ్ స్మాష్ వీడియో. అందులో శ్రీరెడ్డి హావభావాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మరి ఈ వీడియో చూసి లారెన్స్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Tags:    

Similar News