#యంగ్ టైగ‌ర్ 30 ఉంటుందా? ఉండ‌దా?

Update: 2022-10-10 23:30 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 30వ చిత్రం ప్రారంభంపై అభిమానుల్లో నెల‌కొన్న ఆస‌క్తి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అదిగో పులి..ఇదిగో తోక  అన్న చందంగా ప్ర‌చారం త‌ప్ప ఇంత‌వ‌ర‌కూ  రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టింది లేదు. అటు ఎన్టీఆర్ గానీ..ఇటు కొర‌టాల శివ గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో  విసుగు చెందిన అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా డైరెక్ట్ గానే ఎటాకింగ్ దిగిన సంగ‌తి తెలిసిందే.

రిలీజ్ సంగ‌తి దేవుడెరుగు? క‌నీసం షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పాండంటూ  వేడుకున్నారు. అయినా ఆ ఇద్ద‌రు మౌనాన్ని మాత్రం వీడ‌లేదు. మ‌రోవైపు హైద‌రాబాద్ శివార్ల‌లో షూటింగ్ కోసం ఓ భారీ సెట్ ని నిర్మిస్తున్న‌ట్లు ప్రచారం సాగుతోంది. తార‌క్ యాక్ష‌న్ తో బ‌రిలోకి దిగుతార‌ని వినిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో కొత్త ప్రచారం తెర‌పైకి వ‌స్తుంది.

ఈనెల 30 నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందంటూ ఓ వార్త  వైర‌ల్ గా మారింది. ఆ విష‌యాన్ని యూనిట్ అధికారికంగా రివీల్ చేయ‌డానికి రెడీ అవుతుంద‌ని వినిసిస్తుంది. అయితే ఇలాంటి వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవ్వ‌డం కొత్తేం కాదు. ఇప్ప‌టికే చాలాసార్లు ఇలాంటి క‌థ‌నాలు అభిమానుల్ని నిరుత్సాహ ప‌రిచాయి. వాటితో ప్రేక్ష‌కులు సైతం విసుగుపోయారు.

ఈ నేప‌థ్యంలో అస‌లు సినిమా ఉంటుందా? ఉండ‌దా?  అన్న సందేహాలు నెమ్మ‌దిగా అభిమానుల్లో బ‌ల‌ప‌డుతున్నాయి. ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఈ కాంబినేష‌న్ సెట్ అవ్వ‌డం క‌ష్టం అంటూ గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఒక‌వేళ సెట్ అయితే ఈపాటికే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌ల‌య్యేదేని..ఇద్ద‌రు మౌనంగా ఉన్నారంటే?  స్ర్కిప్ట్ ప‌రంగా తారక్ సంతృప్తి చెందలేద‌ని...కొర‌టాల ఎంత చెక్క‌కుతున్నా ఓ ప‌ట్టాన తార‌క్  అంగీక‌రించ‌డం లేద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌ధానంగా తార‌క్ 'ఆర్ ఆర్ ఆర్' తో పాన్ ఇండియా స్టార్ అయిన నేప‌థ్యంలోనే త‌దుప‌రి సినిమా విష‌యంలో  ఇంత‌టి  గంద‌ర‌గోళం నెల‌కొందని మెజార్టీ వ‌ర్గం భావిస్తోంది. అంత‌కు మించి కొర‌టాల  తెర‌కెక్కించిన 'ఆచార్య' ప్లాప్.. ఆర్ ఆర్ ఆర్ లో తార‌క్ రోల్ విష‌యంలో కొంత మంది అభిమానులు అసంతృప్తి వంటి అంశాలు టైగ‌ర్ ని వెన‌క్కి లాగిపెడుతున్న‌ట్లు వినిపిస్తోంది.

మ‌రి వీట‌న్నింటిపై క్లారిటీ రావాలంటే?  సినిమా రెగ్యుల‌ర్ షూట్ తోనైనా బ‌ధులు దొర‌కాలి?  లేదంటే తార‌క్ కొత్త ద‌ర్శ‌కుడి పేరునైనా వెలుగులోకి తేవాలి. మ‌రి ఏం జ‌రుగుతుంద‌న్న‌ది ఆ పెరుమాళ్ల‌కే ఎరుక‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News