సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "యశోద". హరి & హరీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
"యశోద" సినిమాకి పెట్టిన బడ్జెట్ మరియు ఇప్పటి వరకూ సాధించిన వసూళ్లను బట్టి చూస్తే.. బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. కానీ మేకర్స్ మాత్రం ఈ మూవీ ఘన విజయం సాధించిందని ఊదరగొడుతూ, సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ప్రోమోలు వదులుతున్నారు.
సమంత సినిమా ఫస్ట్ వీక్ లో ఎంత వసూలు చేసిందనే లెక్కలు పక్కన పెడితే.. ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన "యశోద" మూవీకి సంబంధించిన ప్రోమో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది.
"యశోద" సినిమా బాక్సాఫీస్ వద్ద 'థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్'గా నిలిచిందంటూ మేకర్స్ కొన్ని ప్రోమోలను ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. అయితే THRILLING BLOCKBUSTER అనే టైటిల్ హెడర్ లో N మరియు C లెటర్స్ హైలైట్ చేయబడి ఉండటమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
సమంత మాజీ భర్త అక్కినేని నాగచైతన్యని 'NC' అని సంబోధిస్తుంటారు. సోషల్ మీడియాలో ఏదైనా మూవీ అప్డేట్ ఇచ్చినా.. సినిమా వర్కింగ్ టైటిల్ అయినా #NC ట్యాగ్ తో మెన్షన్ చేయబడుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు 'యశోద' మూవీ ప్రోమోలో NC హైలైట్ చేయబడి కనిపిస్తోంది.
నిజానికి అక్కడ ఆ రెండు లెటర్స్ ని అలా ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు. యశోద సినిమాకు NC ఆంగ్ల అక్షరాలకు ఎలాంటి సంబందం లేదు. అయినా ఇలా హైలైట్ చేయడంతో కావాలనే నాగ చైతన్యని టార్గెట్ చేస్తున్నట్లుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
దీంతో సమంత టీమ్ కావాలని చేసిందా? ఇదంతా ఆమెకి తెలిసే జరిగిందా? లేదా న్యూస్ ఛానల్స్ ఇలా అత్యుత్సాహం ప్రదర్శించారా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇది నిజంగా చైతూ లక్ష్యంగా చేసిన పని అయితే.. ఏమాత్రం సరైంది కాదని ఓ వర్గం ఫ్యాన్స్ అంటున్నారు.
ప్రేమ వివాహం చేసుకున్న నాగచైతన్య - సమంత.. నాలుగేళ్లు తిరక్కుండానే వైవాహిక బంధాన్ని ముగించారు. ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి వేర్వేరు మార్గాల్లో జీవితం ముందుకి సాగుతున్నారు.
చై - సామ్ విడిపోతున్నట్లు ప్రకటించి కూడా యేడాది దాటిపోయింది. అయినప్పటికీ పరోక్షంగా ఇలా NC ని టార్గెట్ చేయడం సమంజసం కాదని అక్కినేని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కావాలని చేశారా? యశోద టీమ్ కి తెలియకుండానే జరిగిందా? అనేది తెలియదు కానీ.. సమంత సినిమా ప్రోమోలో NC ని హైలైట్ చేయడం హాట్ టాపిక్ నడుస్తోంది. మరి మేకర్స్ దీనిపై వివరణ ఇస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View
Full View Full View