కొన్నిసార్లు అరుదైన సందర్భాలు ఉద్వేగానికి గురి చేస్తుంటాయి. ముఖ్యంగా క్రీడాకారుల జీవితాల్లో .. క్రీడల్ని అభిమానించే వారి జీవితాల్లోనూ ఇలాంటి ఉద్వేగాలకు ఆస్కారం చాలా ఎక్కువ. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా గెలుచుకున్న వైనంపై అందాల కథానాయిక సయామీ ఖేర్ ఎంతో ఎమోషనల్ అయ్యింది.
ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా చారిత్రాత్మక టెస్ట్ విజయాన్ని ఎన్నటికీ మరువలేనని అంటోంది. అంతేకాదు ఆ విక్టరీని అక్షరబద్ధం చేస్తానని పుస్తకం రిలీజ్ చేస్తానని తెలిపింది.
క్రికెట్ అభిమానిగా ఇది నేను చూసిన అత్యుత్తమ పునరాగమన కథ. స్వల్ప స్కోర్ నుంచి.. 11 మంది ఫిట్ ప్లేయర్ లను కనుగొనడం వరకు.. సిరీస్ గెలుపు ప్రతిదీ ఉద్విగ్నమే. టీమిండియా సాధిస్తుందని ఎవరూ నమ్మలేదు. అయినా సాధించి చూపించింది. ఈ గెలుపు చాలా ఉత్సాహంగా ఉద్వేగభరితం.. ఇవన్నీ పుస్తకంలో రాయాలని అనుకుంటున్నాను అని తెలిపింది.
సయామి క్రీడాభిమాని. ముఖ్యంగా క్రికెట్ కు విపరీతమైన అభిమాని. ఆమె తరచూ తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో `సిల్లీ పాయింట్ విత్ సైయామి` అనే క్లిప్ లలో షేర్ చేస్తుంది. కంగారూలపై టీమిండియా విక్టరీపై `వైల్డ్ డాగ్` బ్యూటీ పుస్తకం ఎంత ఎమోషనల్ గా రీడబులిటీతో ఉంటుంది? అన్నది పాఠకులే చెప్పాల్సి ఉంటుంది.