క్రిటిక్స్ ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద తిరస్కారానికి గురైన నాగార్జున వైల్డ్ డాగ్.. త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. వైల్డ్ డాగ్ మే మూడోవారం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఎన్.ఐ.ఏ తీవ్రవాద ఆపరేషన్ నేపథ్యంలో ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. మంచి సమీక్షలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన చిత్రంగా క్రిటిక్స్ లో చర్చ సాగుతోంది.
నిజానికి వైల్డ్ డాగ్ రూ .27 కోట్ల డీల్ తో ఓటీటీ కోసం నిర్మించారని ప్రచారమైంది. కానీ ఉప్పెన -జాతి రత్నాలు ఫలితాలను చూసిన తరువాత మేకర్స్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసి థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ తమ నిర్ణయం తప్పు అని ప్రూవైంది. బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన నాగార్జున సహా టీమ్ ని ఎంతో నిరాశపరిచింది.
అడివి శేష్ - శోభిత ధూళిపాల- ప్రియాంక వంటి తారలతో తెరకెక్కిన స్పై యాక్షన్ చిత్రం గూఢచారి సక్సెస్ నిజానికి నాగార్జునలో ఎంతో స్ఫూర్తి నింపింది. పరిమిత బడ్జెట్ తో శేష్ చేసిన మ్యాజిక్ పైనా ఆయన ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత నాగార్జున కూడా తీవ్రవాదం నేపథ్యంలో వైల్డ్ డాగ్ కాన్సెప్ట్ ని ఎంచుకోవడం ఆసక్తిని కలిగించింది. ఆశించినట్టే సినిమా బాగా తీశారు. కానీ ఫలితమే ఊహించనిది.
కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన చాలాసార్లు నాగార్జునకు నెగెటివ్ ఫలితం ఎదురైంది. కానీ ఆయన అదే కొత్త దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అవకాశం ఇచ్చారు. నాగ్-ఆర్జీవీ కాంబినేషన్ శివ సంచలనాల గురించి తెలిసినదే. ఇప్పుడు వైల్డ్ డాగ్ కోసం సోలమన్ కి అవకాశం ఇచ్చారు. అతడు నిరూపించినా కానీ బాక్సాఫీస్ ఫలితం ఊహించని విధంగా వచ్చింది.