నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలు అయ్యింది. థియేటర్లలో సినిమాను చూడని జనాలు ఓటీటీ లో మాత్రం పెద్ద ఎత్తున చూస్తున్నారు. మామూలుగా అయితే నెట్ ఫ్లిక్స్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఖాతాదారులు లేరు. అయినా కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఖాతాను తీసుకుంటున్న వారు ఉన్నారు. తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన సినిమాల్లో వైల్డ్ డాగ్ అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈ నెల ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైల్డ్ డాగ్ ను ప్రేక్షకులు ఆధరించలేదు. పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం మరీ దారుణంగా వచ్చాయి. ఆశించిన కలెక్షన్స్ లో కనీసం 25 శాతం కూడా రాలేదు అనేది టాక్. టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్న నాగార్జున సినిమాకు మరీ ఇంత దారుణమైన కలెక్షన్స్ ఏంటీ అంటూ సినీ పండితులు కూడా ముక్కున వేలేసుకున్నారు. కరోనా భయంతో పాటు సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ ను కలిగి లేకపోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ చూసేందుకు ఆసక్తి చూపించలేదు అనేది ఒక టాక్. మొత్తానికి వైల్డ్ డాగ్ నాగ్ పరువు పోగొట్టే విధంగా వసూళ్లతో ముగించాల్సి వచ్చింది.
థియేటర్ లో పరువు పోగొట్టిన వైల్డ్ డాగ్ ఓటీటీలో మాత్రం పరువు దక్కించిందని అక్కినేని అభిమానులు అంటున్నారు. కేవలం తెలుగు వర్షన్ మాత్రమే కాకుండా తమిళం మరియు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో పెద్ద ఎత్తున చూస్తున్నారు. ఇది అక్కినేని అభిమానులు గొప్పగా చెప్పుకునే విషయంగా ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. కరోనా కారణంగా వైల్డ్ డాగ్ వసూళ్ల విషయంలో నిరాశ పర్చింది. కాని సినిమా కంటెంట్ ఎలాంటిదో నెట్ ఫ్లిక్స్ లో అయిన సక్సెస్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.