పవన్‌ పిలుపే ప్రభంజనం: రామ్‌ చరణ్‌

Update: 2019-01-06 14:06 GMT
వినయ విధేయ రామ సినిమా రిలీజ్‌ కు దగ్గరపడింది. దీంతో.. చానెల్స్‌, పేపర్లు అనే తేడా లేకుండా అందరికి వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. ఈ ఇంటర్వ్యూల్లో అన్ని ప్రశ్నలతో మరో ప్రశ్న చాలా కామన్‌ గా మారింది. అదే.. పవన్‌ కల్యాణ్‌. వచ్చే ఎన్నికల్లో పవన్‌ తరపున ప్రచారం చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా సమాధానం ఇస్తున్నాడు చరణ్‌. బాబాయ్‌ ఒక్క ఫోన్‌ చేసి పిలిస్తే చాలు.. అందరూ వచ్చి వాలిపోతాం అని చెప్తున్నాడు చరణ్‌.

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ ప్రచారం చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ ఎక్కడా ప్రచారానికి రాలేదు. ఇప్పుడు బాబాయ్‌ కోసం ప్రచారం చేస్తావా అంటే కచ్చితంగా వస్తాను, చేస్తాను అని చెప్తున్నాడు చరణ్‌. జనసేనలో చేరలేదు అనే ఒక్క విషయం పక్కన పెడితే.. మొదటినుంచి మెగాస్టార్‌ కుటుంబం పవన్‌కల్యాణ్‌ కు అండగానే ఉంది. మొన్నటికి మొన్న నాగబాబు, వరుణ్‌ తేజ్‌ జనసేన పార్టీకి విరాళం ఇచ్చారు. ఇక వినయ విధేయ రామ ఆడియో లో జనసేన గుర్తు టీ గ్లాసు గురించి ప్రస్తావించాడు చరణ్‌. బాబాయ్‌ కోసం ఏదైనా చేస్తామని చెప్పిన చరణ్‌.. ఆయన ఫోన్‌ చేస్తే చాలు వాలిపోతాం అంటున్నాడు. మరి మెగా ఫ్యామిలీ సపోర్ట్‌ పవన్‌ కల్యాణ్‌ తీసుకుంటాడో లేదో వెయిట్‌ అండ్‌ సీ.




Full View

Tags:    

Similar News