బాల‌య్య‌తో హ్యూమా ఖురేషీ సెట్ట‌వుతుందా?

Update: 2022-11-18 10:30 GMT
న‌ట‌సింహ బాల‌కృష్ణ 108వ సినిమాకి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. అనీల్ రావిపూడి ద‌ర్శ‌త‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. బాల‌య్య మార్క్ యాక్ష‌న్ తో పాటు..అనీల్ మార్క్ వినోదం అంచ‌నాల్ని అంత‌కంత‌కు పెంచేస్తున్నాయి. ఇప్ప‌టికే బాల‌య్య‌కి ప్ర‌తినాయ‌కుడిగా బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ని దింపుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

బాల‌య్య‌తో వార్ అంటే? అర్జున్ లాంటి వాడే స‌రితూగుతాడ‌ని అనీల్ ప‌ట్టుబ‌ట్టి దిగుమ‌తి చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇక బాల‌య్య‌కి జోడీగా  ఎంపిక చేసే హీరోయిన్ విష‌యంలో  ఇంకా తర్జ‌న‌భ‌ర్జ‌న కొన‌సాగుతుంది. సీనియ‌ర్ హీరోయిన్ల నుంచి కొత్త భామ‌ల వ‌ర‌కూ  కొన్ని పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. ప్రియ‌మ‌ణి...శ్రీలీల ఇలా కొంత మంది క్యూలో ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.

అయితే అనీల్ ఆలోచ‌న మాత్రం వేరుగా క‌నిపిస్తుంద‌న్న‌ది తాజా అప్ డేట్. బాలీవుడ్ లో పేరున్న హీరోయిన్ తీసుకురావా ల‌న్న‌ది ఆయ‌న ప్లాన్ గా వినిపిస్తుంది. దీనిలో  భాగంగా హాట్ బ్యూటీ హ్యూమా ఖురేషీ పేరు వినిపిస్తుంది.  బాల‌య్య ఏజ్ ని మ్యాచ్ గ‌ల బ్యూటీగా  హ్యూమా రేసులో ఉంది. శ్రీలీల లాంటి యంగ్ హీరోయిన్ల‌ను తీసుక‌కున్నా బాల‌య్య ప‌క్క‌న సూట‌వ్వ‌రు అన్న విమ‌ర్శ‌లొస్తున్నాయి.

బాల‌య్య వ‌య‌సుని మ్యాచ్ చేయాలంటే 30 ఏళ్లు దాటిన హీరోయిన్ అయితే త‌ప్ప‌! కుదర‌డం క‌ష్టం అవు తుంద‌ని ఆ వ‌య‌సున్న  భామ‌ల్నే చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో హ్యూమా పేరు వినిపిస్తుంది. అలాగే ఈ బ్యూటీకి సౌత్ లో సినిమాలు చేసిన అనుభం ఉంది. తెలుగులో న‌టించ‌లేదు గానీ..త‌మిళ్ లో కొన్ని సినిమాలు చేసింది. ఆ మ‌ధ్య 'వ‌లిమై' లో కూడా న‌టించింది.

అంత‌కుముందు ర‌జ‌నీకాంత్ 'కాలా'లోనూ న‌టించింది. ఈ నేప‌థ్యంలో అనీల్ హ్యూమాని దృష్టిలో పెట్టుకుంటున్నారా? అన్న‌ది  మ‌రో సందేహం. అయితే బాల‌య్య స్టార్ ఇమేజ్ కి హ్యూమా స‌రిప‌డ‌దు? అని మెజార్టీ వ‌ర్గం భావిస్తుంది.

బాల‌య్య గ్రేస్ ని అందుకోవాలంటే తెలుగులో పాపుల‌ర్ అయిన హీరోయిన్ అయినా అవ్వాలి?   లేదా?  బాలీవుడ్ లో పేరున్న భామ‌నైనా దించాలి త‌ప్ప‌! హ్యూమా లాం టి వాళ్లు బాల‌య్య వేగాన్ని త‌ట్టుకోలేరు అని గ‌ట్టిగానే వినిపిస్తుంది. హ్యూమా క‌న్నా బెట‌ర్ గా...కాజ‌ల్ అగ‌ర్వాల్... నిత్యామీన‌న్ లాంటి వాళ్లు అయితే బాగుంటుంద‌ని నెటి జ‌నులు సూచిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News