తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వారీసు'. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు అత్యంత భారీ స్థాయిలో దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఈ మూవీలో విజయ్ కి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ఇదే సినిమాని 'వారసుడు'గా రిలీజ్ చేయబోతున్నారు. 2023 సంక్రాంతి బరిలో జనవరి 12న అత్యంత భారీ స్థాయిలో తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది.
సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలు 'వీర సింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పండగల వేళ తెలుగు సినిమాలకే ప్రధాన్యత నివ్వాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ ప్రకటన చేయడం.. దీనిపై తమిళ నిర్మాతలు కౌంటర్ ఇవ్వడం.. ఆ తరువాత తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటనపై తమిళ దర్శకుడు ఎన్. లింగుస్వామి ఘాటుగా స్పందించడంతో వివాదం మొదలైంది. ఈ వివాదం కారణంగా 'వారీసు' ప్రధానంగా వార్తల్లో నిలవడం మొదలైంది.
తెలుగు సినిమాలని కాదని నిర్మాత దిల్ రాజు తమిళ సినిమా 'వారసుడు' కోసం థియేటర్లని బ్లాక్ చేశాడంటూ విమర్శలు తలెత్తడంతో తమిళనాట 'వారీసు'.. తెలుగు నాట 'వారసుడు' వార్తల్లో నిలుస్తూ వస్తోంది.
'వారసుడు' థియేటర్ల విషయంలో నెలకొన్న వివాదంపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు. 'వారసుడు' రిలీజ్ ని అన్ని సినిమాల కంటే ముందు నేను ప్రకటించానని, ఆ తరువాతే మిగతా వారు సంక్రాంతికి వస్తున్నామంటూ ప్రకటించారని, ఇందులో తన తప్పేమీ లేదని వివరణ ఇచ్చాడు.
'వారసుడు' థియేటర్ల విషయంలో వివాదం అయితే అయ్యింది కానీ పైసా ఖర్చు లేకుండా దిల్ రాజుకు మాత్రం ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెడుతోంది. గత నెల రోజులుగా ఈ సినిమా థియేటర్ల వివాదం కారణంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది.
తమిళ నిర్మాతలు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటన పై అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంలోనూ 'వారీసు' వార్తల్లో నిలవడం తెలిసిందే. ఇలా గత నెల రోజులుగా ఏదో ఒక ఇష్యూ కారణంగా విజయ్ సినిమా వార్తల్లో నిలుస్తూ కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీని సొంతం చేసుకుంటూ నెట్టింట వైరల్ కావడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.