హీరోలందరికీ ఎల్లకాలం ఒకే రకమైన క్రేజ్ ఉండదు. అలాంటి అదృష్టం కొందరికే ఉంటుంది. కొందరేమో హీరోలుగా కొనసాగుతారు కానీ ఎక్కువకాలం అభిమానులను.. క్రేజ్ ను నిలబెట్టుకోలేరు. శంకర్ 'బాయ్స్'.. మణిరత్నం 'యువ' సినిమాల్లో నటించి అందరినీ ఆకర్శించాడు సిద్ధార్థ్. ఇక మొదటి తెలుగు సినిమా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సూపర్ డూపర్ హిట్. ఒకటి అరా ఫ్లాపుల తర్వాత 'బొమ్మరిల్లు' లాంటి మరపురాని బ్లాక్ బస్టర్ తగిలింది. బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ తో 'రంగ్ దే బసంతి' లో నటించాడు.
అప్పట్లో సిద్ధార్థ్ క్రేజ్ ఆకాశంలో ఉండేది. యూత్ కు ఫేవరేట్ హీరో. కానీ అప్పటి నుంచి ఒక్క సాలిడ్ కూట్ కూడా పడలేదు. అయితే ఫ్లాప్.. లేకపోతే యావరేజ్ అన్నట్టుగా సాగింది కెరీర్. ఒక దశలో తెలుగులో పూర్తిగా ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో తమిళ పరిశ్రమపై ఫోకస్ చేసి కెరీర్ కొనసాగిస్తున్నాడు. మంచి హిట్లు కూడా దక్కాయి. రెండేళ్ళ క్రితం తమిళ సినిమా 'అవళ్' డబ్బింగ్ వెర్షన్ 'గృహం' తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సూపర్ హిట్ కాలేదు కానీ సిద్ధార్థ్ కు చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి పేరు వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా తెలుగులో మళ్ళీ సత్తా చాటాలనే ప్రయత్నాలలో ఉన్నాడు సిద్ధార్థ్.
కార్తిక్ జీ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టక్కర్' అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాతో తన అదృష్టం పరిక్షించుకుంటున్నాడు. ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటించింది. అభిమన్యు సింగ్.. యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 2020 ఫిబ్రవరి లో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను సిద్ధార్థ్ తన రీలాంచ్ లాగా భావిస్తున్నాడట. అయితే ఈ అవుట్ డేటెడ్ హీరోను ఈ తరం ప్రేక్షకులు పట్టించుకుంటారా అనేది అనుమానమే. తెలుగులో వరుణ్ సందేశ్ లాంటి హీరోల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం కదా.. బిగ్ బాస్ లో పాల్గొన్నా కూడా పెద్దగా ఉపయోగం లేదు. మరి 'టక్కర్' తో సిద్ధార్థ్ కు బ్రేక్ దక్కుతుందా అనేది చూడాలి.