ఆర్.ఆర్.ఆర్ విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. ఇక అందరి కళ్లు కేజీఎఫ్ 2 పైనే. ఈ సినిమా ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్లను బీట్ చేస్తుందా? అంటూ అప్పుడే చర్చ మొదలైంది. అందుకు తగ్గట్టే కేజీఎఫ్ టీమ్ ప్రచారంలో జోరు పెంచింది. ఆదివారం బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మోస్ట్ అవైటెడ్ K.G.F- చాప్టర్ 2 ట్రైలర్ ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి యష్ -సంజయ్ దత్- రవీనా టాండన్ తదితరులు హాజరయ్యారు. కరణ్ జోహార్ హోస్ట్ చేసారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ .. సహనటుడు సంజయ్ దత్ గురించి యష్ మాట్లాడారు.
K.G.F- చాప్టర్ 2లో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించాడు. ట్రైలర్ లాంచ్ లో యష్ మాట్లాడుతూ .. దత్ నిబద్ధతకు తాను ముగ్ధుడయ్యానని తన ఆరోగ్యం గురించి భయపడ్డానని అంగీకరించాడు. సంజు సార్ నిజమైన ఫైటర్. నేను ప్రత్యక్షంగా చూశాను. అతను జీవితాన్ని చూశాడు. అతను తన ఆరోగ్యంతో పడిన అన్నింటికీ ప్రాజెక్ట్ కి కట్టుబడి ఉన్నాడు. నేను అతనిని చూసి భయపడ్డాను. అతను ప్రాజెక్ట్ తీసుకున్నాడు. మరొక స్థాయి.. నేను ఎప్పుడూ అభిమానిని అని అతను చెప్పాడు.
సినిమా మొదటి పార్ట్ సక్సెస్ కి క్రెడిట్ అంతా ప్రశాంత్ నీల్ కే దక్కుతుందని యష్ అన్నారు. నా పరిశ్రమతో నేను చాలా అటాచ్ అయ్యాను. నా సినిమాకి కనీసం క్రెడిట్ అందుకోవాలి. నిజాయితీగా చెప్పాలంటే కేజీఎఫ్ చాప్టర్ 1తో మనం సాధించినందుకు సంతోషంగా ఉంది. ప్రశాంత్ నీల్ వల్ల KGF సాధ్యమైంది. చాలా మంది నాకు క్రెడిట్ ఇస్తారు. కానీ అది బుల్ షిట్. ఇది ప్రశాంత్ నీల్ చిత్రం. అతను అన్ని క్రెడిట్ లకు అర్హుడు. అతను మొదటిసారి వచ్చిన వారిని కూడా పూర్తి ప్రొఫెషనల్ గా మార్చగలడు. అతను తన హీరోలు .. నటులను ప్రేమిస్తాడు.. అంటూ విలువైన మాటలు మాట్లాడాడు.
K.G.F 2 ఏప్రిల్ 14న థియేటర్ లలో విడుదల కానుంది. మూవీ విడుదలకు ఒక రోజు ముందు.. దళపతి విజయ్ చిత్రం మృగం కూడా థియేటర్ లలో విడుదల కానుంది. ఈ బిగ్ ఫైట్ గురించి యష్ మాట్లాడుతూ.. ``ఇది ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడిపోతారో ఒక్క ఓటుతో నిర్ణయించే ఎన్నికలు కాదు. ఇది సినిమా. ఇది కేజీఎఫ్ 2 .. బీస్ట్ గా ఉంటుంది.. కేజీఎఫ్ 2 వెర్సెస్ బీస్ట్ కాదు. నేను దాన్ని క్లాష్ గా చూడను. విజయ్ సార్ నా సీనియర్. నా సినిమా ఆయన కంటే పెద్దది అని నేను అనుకోవడం మొదలుపెడితే పతనం అక్కడే మొదలవుతుంది..అంటూ తన వినమ్రతను చాటుకున్నాడు. RRR తర్వాత K.G.F- చాప్టర్ 2పైనే కళ్లన్నీ ఉన్నాయి. ఆర్.ఆర్.ఆర్ దాదాపు 750 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే నేపథ్యంలో RRR రికార్డుల్ని K.G.F- చాప్టర్ 2 తుడిచేస్తుందా? అంటూ చర్చ మొదలైంది. కేజీఎఫ్ 2 కి ఉన్న బజ్ దృష్ట్యా 1000 కోట్లు వసూలు చేస్తేనే రికార్డ్ అందుకున్నట్టు. కానీ ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇక కేజీఎఫ్ 2తో పోటీపడుతూ విజయ్ బీస్ట్ ఏ మేరకు సెన్సేషన్స్ సృష్టిస్తుంది? అన్నది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.