రాఖీభాయ్ యష్ నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ `కేజీఎఫ్ చాప్టర్ 1` దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సైలెంట్ గా విడుదలైన ఈ మూవీ మోన్ స్టర్ గా మారి వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కన్నడ ఇండస్ట్రీకి మునుపెన్నడూ కని వినీ ఎరుగని గుర్తింపుని అందించింది. పిరియాడిక్ ఫిక్షనల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఒకేసారి ఇద్దరిని పాన్ ఇండియా స్టార్ లుగా నిలబెట్టింది. హీరో యష్ అప్పటి వరకు ఓ సాధారణ యాక్షన్ హీరో, దర్శకుడు ప్రశాంత్ నీల్ వన్ ఫిల్మ్ వండర్.
కానీ ఈ ఇద్దరు `కేజీఎఫ్ చాప్టర్ 1` తో పాన్ ఇండియా స్టార్ లు గా మారిపోయారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి `కేజీఎఫ్ చాప్టర్ 2`ని చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ సంచలనాలు సృష్టించగడంతో చాప్టర్ 2పై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే చాప్టర్ 2కి సరికొత్త హంగులతో పాటు క్రేజీ యాక్టర్ లని జోడించారు ప్రశాంత్ నీల్.
చాప్టర్ 2కు కీలకంగా మారే అధీరా పాత్రలో బాలీవుడ్ బ్యాడ్ మెన్ సంజయ్ దత్ నటించగా, రాఖీ భాయ్ పై షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చే ప్రధాని రమికా సేన్ పాత్రలో రవీనా టాండన్ నటించింది.
ఇక మరో రెండు కీలక పాత్రలలో ప్రకాష్ రాజ్, రావు రమేష్ కనిపించబోతున్నారు. చాప్టర్ 1ని దృష్టిలో పెట్టుకుని చాప్టర్ 2 మరింత హైలీగా వుంటుందిని, గరుడని అంతం చేసిన రాఖీ తనే సర్వాధికారికగా మారి ఎంపరర్ ని ఎలా నిర్మించుకున్నాడు? దీనికి ఏం చేశాడు? ఈ క్రమంలో రాఖీకి అధీరా కలిగించిన అంతరాలేంటీ? అనే ఆసక్తికరమైన కథ, కథనాలతో చాప్టర్ 2 సాగబోతోంది.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. టీజర్ లోనే రాఖీ తన విశ్వరూపాన్ని చూపించేయడంతో ట్రైలర్ ఇక భీభత్సమే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ఈ నెల 27న ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. అంతే కాకుండా ఈ మూవీని ఏప్రిల్ 14న నవిడుదల చేస్తున్నామని మరో సారి స్పష్టం చేసింది. అయితే తాజాగా ఈ డేట్ కి `కేజీఎఫ్ 2` విడుదల కావడం కష్టమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే రెండు మూడు సార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ మూవీ మరో సారి వెనక్కి వెళ్లే అవకాశం వుందని చెబుతున్నారు. రికార్గు స్థాయిలో చాప్టర్ 1 కి మించి బిజినెస్ జరుపుకుంటున్న ఈ మూవీ వీఎఫ్ ఎక్స్ కారణంగా ఆలస్యం అయ్యే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఏప్రిల్ రెండవ వారం మిస్ అయితే మూడవ వారం ఈ మూవీ థియేటర్లలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇందులో యష్ కి జోడీగా శ్రీనిధిశెట్టి నటించింది. మాళవిక అవినాష్, ఈశ్వరీ రావు, అచ్యుత్ కుమార్, బి.ఎస్. అవినాష్, నాగాభరణ, వశిష్ట సింహా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
రవిబాస్రూర్ సంగీతం అందించగా, భువన గౌడ ఛాయాగ్రహణం అందించారు. తెలుగులో దిల్ రాజు, హిందీలో ఫర్హాన్ అక్తర్, తమిళంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, మలయాళంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ పై రిలీజ్ చేస్తున్నారు.