భారతదేశం గర్వించదగ్గ దర్శకులతో శంకర్ ఒకరు. తమిళ నాట సినిమాలు తీసే శంకర్.. తన సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అగ్ర దర్శకుడు.. కమర్షియల్ సినిమాతో సోషల్ మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. 'జెంటిల్ మ్యాన్' 'భారతీయుడు' 'ప్రేమికుడు' 'ఒకే ఒక్కడు' 'శివాజీ' 'రోబో' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో టాలీవుడ్ స్టార్ హీరోలతో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని శంకర్ చూస్తున్నారు. అయితే ఇన్నేళ్ళకు గానూ శంకర్ తెలుగులో సినిమా కార్యరూపం దాల్చబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో షో మ్యాన్ శంకర్ ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందించడానికి రెడీ అయ్యారు.
శంకర్ - చరణ్ కాంబోలో రాబోతున్న '#RC15' చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా శంకర్ శైలిలో సందేశాత్మక అంశాలతో రూపొందే కమర్షియల్ చిత్రం అని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఇది 'ఒకే ఒక్కడు' తరహాలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని.. ఇందులో చరణ్ పొలిటీషియన్ గా నటిస్తారని అంటున్నారు. దీంతో చరణ్ ని కొత్త అవతారంలో చూడబోతున్నామని మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎగ్జైటింగ్ గా ఉన్నారు.
అయితే ఇప్పుడు మెగా అభిమానులను ఖుషీ చేసే మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే శంకర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడట. గతంలో చరణ్ 'నాయక్' సినిమాలో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలో మరోసారి '#RC15' తో డబుల్ రోల్ లో మెప్పిస్తారో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇకపోతే 'శంకర్ - చరణ్' సినిమా కోసం డైలాగ్స్ రాయడానికి ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్ ని తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే 'హరి హర వీరమల్లు' రచయిత ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి కూడా ఆయనే మాటలు రాస్తున్న సంగతి తెలిసిందే.
'#RC15' చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న శంకర్ వీటిని దగ్గరుండి చూసుకుంటున్నారు. అదే క్రమంలో నటీనటులు - సాంకేతిక నిపుణులను కూడా ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ వివరాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ తో పాటుగా ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రెండు పాటలు మినహా ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తయింది. ఆగస్టు చివరి నాటికి పెండింగ్ వర్క్ పూర్తి చేయడానికి దర్శకుడు రాజమౌళి షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తో కలసి చేస్తున్న 'ఆచార్య' షూటింగ్ కూడా ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఆగస్టు నెలాఖరుకు ఈ రెండు చిత్రాలను కంప్లీట్ చేసి.. సెప్టెంబర్ లో శంకర్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని చరణ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మరోవైపు దర్శకుడు శంకర్.. రామ్ చరణ్ 15వ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో సినిమా మొదలు పెట్టనున్నారు. ఇది బ్లాక్ బస్టర్ 'అపరిచితుడు' చిత్రానికి హిందీ రీమేక్ గా రూపొందనుంది. పెన్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.