క‌న్న‌డిగల‌కు మ‌న‌ సిట్టిబాబు న‌చ్చుతాడా?

Update: 2019-07-12 07:49 GMT
బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్ని ఇరుగు పొరుగు భాష‌ల్లో రిలీజ్ చేస్తూ అద‌న‌పు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు నిర్మాత‌లు. రామ్ చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించిన రంగ‌స్థ‌లం ఏడాది త‌ర్వాత క‌న్న‌డ‌లోకి అనువాద‌మై రిలీజ‌వుతోంది. `మాయా బ‌జార్` త‌ర్వాత మ‌ళ్లీ ఓ తెలుగు సినిమా ఇంత పెద్ద ఎత్తున‌ క‌న్న‌డ‌లోకి అనువాద‌మై రిలీజ్ అవ్వడం అన్న‌ది ఇదేన‌ని చెబుతున్నారు. మోడ్ర‌న్ డేస్ లో `రంగ‌స్థ‌లం`కే ఆ ఛాయిస్ ద‌క్కింద‌ట‌. అక్క‌డ `రంగ‌స్థ‌ల` టైటిల్ తో నేడు (జూలై 12న) రిలీజైంది.

ఈ సినిమా కన్న‌డ నేటివిటీకి క‌నెక్ట‌య్యేదేన‌న్న చ‌ర్చ సాగుతోంది. అందుకే `రంగ‌స్థ‌ల‌` కోసం స్టేట్ వైడ్ 85 స్క్రీన్ల‌ను లాక్ చేయ‌డ‌మే గాక‌... కేవ‌లం బెంగ‌ళూరు సిటీలోనే ఏకంగా తొలిరోజు 26 షోల‌ను వేస్తున్నారు. ఏడాది త‌ర్వాత రిలీజ్ చేస్తున్నా ఎంతో కాన్ఫిడెంట్ గా మైత్రి సంస్థ‌ ఇంత భారీగా రిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తించేదే. ప్ర‌ఖ్యాత జేఎం మూవీస్ సంస్థ‌తో క‌లిసి మైత్రి సంస్థ అనువాదాన్ని క‌న్న‌డ‌లో రిలీజ్ చేస్తోంది.

ఇటు తెలుగు రాష్ట్రాల‌తో పాటు అటు బెంగ‌ళూరు.. క‌ర్నాట‌క‌లోనూ రామ్ చ‌ర‌ణ్ కి అభిమానులు ఉన్నారు. పైగా చిట్టిబాబుగా అత‌డి న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి కాబ‌ట్టి `రంగ‌స్థ‌ల` క‌న్న‌డ‌లో స‌క్సెస‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. చెవులు స‌రిగా విన‌ప‌డ‌ని చిట్టిబాబు కూలిప‌నికి వెళ్లే రామ‌ల‌క్ష్మితో ఎలాంటి రొమాన్స్ చేశాడ‌న్న‌ది క‌న్న‌డిగుల‌కు ఏ మేర‌కు క‌నెక్ట‌వుతుంది? అన్న‌ది చూడాలి.

    

Tags:    

Similar News