మాస్ మహారాజా రవితేజ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. 'రాజా ది గ్రేట్' సినిమా తర్వాత రవితేజ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. చివరగా రవితేజ నటించిన 'డిస్కోరాజా' సినిమా గతేడాది జనవరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా నిర్మాతలకి కూడా భారీ నష్టాల్ని మిగల్చిందని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో గతేడాది వేసవి రేసులో నిలవాల్సిన రవితేజ నటించిన 'క్రాక్' సినిమా కరోనా కారణంగా యాధృచికంగా జనవరిలోనే విడుదలకి రెడీ అయింది.
రవితేజ కెరీర్ లో 66వ చిత్రంగా వస్తున్న 'క్రాక్' జనవరి 9న అంటే రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీసర్ పాత్రలో కనిపిస్తుండగా.. ఆయనకు జోడీగా శృతి హాసన్ నటించింది. ఈ సినిమాతో హిట్ కొట్టి రేస్ లో నిలబడాలని రవితేజ ఈ సినిమా కోసం వర్క్ చేసాడని ప్రచార చిత్రాలు చూస్తే అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో 'డిస్కోరాజా' మిగిల్చిన చేదు అనుభవాన్ని 'క్రాక్' సినిమాతో బ్రేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందులోనూ రవితేజ పుట్టినరోజు కూడా జనవరిలోనే కావడంతో ఈ బర్త్ డేకి 'క్రాక్' హిట్ ని గిఫ్ట్ గా ఇస్తాడని ఆశిస్తున్నారు.