తెలుగు సినిమా స్వరూపాన్నే సమూలంగా మార్చిన చిత్రం `బాహుబలి`. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఘనతని చాటిన చిత్రమిది. రాజమౌళి అత్యంత సాహసంతో చేసిన సినిమా ఆయన జాతకాన్నే మార్చేసింది. వరల్డ్ వైడ్ గా ఆయనని గొప్ప దర్శకుడిగా నిలబెట్టింది. విడుదలకు ముందు ఈ సినిమా ని తమ సినిమాగా భావించి తెలుగు మీడియా ఆకాశానికి ఎత్తింది. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా `బాహుబలి` వంక చూసేలా చేసింది. సోషల్ మీడియాలోనూ... ఈ సినిమాపై ప్రత్యేక స్టోరీలు వండి వార్చారు.
ఆ తరువాతే ఈ సినిమా పై బాలీవుడ్ కన్ను పడింది. కరణ్ జోహార్ లాంటి దర్శక నిర్మాత హిందీ వెర్షన్ కి వెన్నుదన్నుగా నిలిచారు. దాంతో ఈ ప్రాజెక్ట్ కాస్తా పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగిపోయింది. దీని వెనక ప్రతీ తెలుగు మీడియా వ్యక్తి కష్టం వుంది. అయితే అలా తమ సినిమాగా స్వచ్ఛందంగా ప్రచారం చేసి తెలుగు మీడియాని `బాహుబలి` టీమ్ పెద్దగా పట్టించుకోలేదు. తన ఫోకస్ ని మొత్తం బాలీవుడ్ మీడియాపై పెట్టింది. మార్కెట్ లెక్కలని వేసుకుని హ్యూజ్ ప్రచారం అవసరమని స్థానిక మీడియాని పక్కన పెట్టే ప్రయత్నం చేసింది.
ఇదే టాలీవుడ్ లో తెలుగు మీడియాకు, `బాహుబలి` టీమ్ కు మధ్య గొడవకు దారితీసింది. కేవలం ఈ సినిమా ప్రెస్ మీట్ ని ఫిల్మ ఛాంబర్ లో ఏర్పాటు చేసి తెలుగు మీడియాని ఆహ్యానించింది చిత్ర బృందం. దీంతో చిర్రెత్తుకొచ్చిన తెలుగు మీడియా సోదరులు చిత్ర బృందాన్ని, దర్శకుడు రాజమౌళిని ప్రెస్ మీట్ సాక్షిగా నిలదీశారు. ఇక్కడి వారిని చిన్నచూపు చూసతున్నారని, కొంత మందికే ఇంటర్త్యూలు ఇస్తున్నారని విమర్శలు చేశారు. దీంతో దిగివచ్చిన రాజమౌళి మిగతా వారికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. కానీ కొంత వరకే.
ఇదే తరహా పరిస్థితులు `RRR` విషయంలోనూ పునరావృతం అవుతున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి.తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆదివారం హైదరాబాద్ లో కాకుండా ముంబైలో నిర్వహించారు. అక్కడే ప్రత్యేకంగా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ,దర్శకుడు రాజమౌళి బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని చిత్ర బృందానికి సబంధించిన అఫీషియల్ ఇన్ స్టా హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.
ఈ ఫొటోలు చూసిన తెలుగు మీడియా సోదరులు ఈ సారి కూడా మనల్ని లైట్ తీసుకుంటారా? అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఇది తెలుగు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో అప్పుడు `బాహుబలి`.. ఇప్పుడు `RRR` సేమ్ సీన్ రిపీట్? అంటూ కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. మరి అంతా భావిస్తున్నట్టే ఈ సారి కూడా రాజమౌళి తెలుగు మీడియాని లైట్ తీసుకుంటారా అన్నది క్లారిటీ రావాలంటే మరో రెండు మూడు రోజులు వేచి చూడాల్సిందే.
ఇటీవల ట్రైలర్ రిలీజ్ తో భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా అత్యంత భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ తారలు అలియాభట్, అజయ్ దేవగన్, హాలీవుడ్ నటులు ఒలివియా మోరీస్, రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఒక దశలో కలిస్తే.. కలిసి పోరాటం చేస్తే ఎం జరిగింది? అనే ఫిక్షనల్ స్టోరీతో ఈ మూవీని రాజమౌళి తెరకెక్కించారు.